జవహర్‌‌ నగర్‌ కార్పొరేషన్‌ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం

జవహర్‌‌ నగర్‌ కార్పొరేషన్‌ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం
  • నాటకీయ పరిణామాల మధ్య  
  • అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్  

జవహర్ నగర్, వెలుగు:  జవహర్ నగర్‌‌  కార్పొరేషన్‌  మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నాటకీయ పరిణామాల మధ్య ఓటింగ్ జరిగింది.  జవహర్ నగర్ కార్పొరేషన్ లోని మొత్తం 28 డివిజన్లకు  ఒక సభ్యుడు మృతి చెందగా.. 27 మంది కార్పొరేటర్లు బీఆర్‌‌ఎస్‌ కు చెందినవారే ఉన్నారు.  ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో 28వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ కాంగ్రెస్ లో చేరారు. మిగతా కార్పొరేటర్లు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జవహర్ నగర్  కార్పొరేషన్ లో రాజకీయ పరిణామాలు మారిపోయారు. 20 మంది కార్పొరేటర్లు గత నెల 20న మేయర్ పై అవిశ్వాస తీర్మాన ం పెట్టారు.

దీంతో  కలెక్టర్  ఫిబ్రవరి 19న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ పెట్టాలని నిర్ణయించారు.  కార్పొరేషన్‌ ఆఫీసులో సోమవారం ఉదయం 11.30 గంటలకు అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేశారు. 20 మంది కార్పొరేటర్లు హాజరై తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.  దీంతో మేయర్ కావ్య సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా ఉప్పల్ ఆర్డీవో ఉపేందర్ వ్యవహరించారు.  కొత్త మేయర్ ఎంపిక తేదీని కలెక్టర్‌‌ ఖరారు చేస్తారు. త్వరలోనే కొత్త మేయర్ గా శాంతి కోటేశ్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని కార్పొరేటర్లు పేర్కొన్నారు.