ఇది మామూలు ఆఫర్ కాదు.. రెజ్యూమ్, డిగ్రీ లేకుండా కోటి రూపాయల జీతంతో జాబ్ !

ఇది మామూలు ఆఫర్ కాదు.. రెజ్యూమ్, డిగ్రీ లేకుండా కోటి రూపాయల జీతంతో జాబ్ !

ఇది నిజం.. ఎలాంటి రెజ్యూమ్, డిగ్రీలతో పనిలేకుండానే కోటి రూపాయల జాబ్ ఆఫర్ చేస్తోంది ఓ  AI స్టార్టప్ కంపెనీ. ఇది విచిత్రంగా ఉంది కదా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జాబ్స్ పోతున్నాయి అంటూ ప్రపంచమంతా బోరుమంటుంటే.. ఎలాంటి రెజ్యూమ్, డిగ్రీ లేకుండా కోటి రూపాయల జీతంతో జాబ్ ఇస్తామని ఓ ఏఐ కంపెనీ ప్రకటించడం ఆశ్చర్యమే. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. రెజ్యూమ్ లేకుండా, డిగ్రీ చూడకుండా అంతపెద్ద జాబ్ ఇచ్చే కంపెనీ ఏంటబ్బా.. అని తెగ వెతికేస్తున్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న కొత్త టెక్నాలజీ. మనిషి చేసే ప్రతిపనినీ సెకన్లలో చేసేస్తోంది. ఇప్పుడు సాఫ్ట్ వేర్, ప్రొడక్షన్, సర్వీసెస్.. ఇలా ఏ రంగంలోనైనా ఏఐ చాలా వరకు వినియోగంలోకి వచ్చేసింది.  ఏఐ వచ్చిన తర్వాత గూగుల్, ఇన్ఫోసిస్, ఎన్వీడియా వంటి  పెద్ద పెద్ద కంపెనీలు వేల సంఖ్యలో లేయాఫ్స్ ప్రకటించి షాకిస్తున్నాయి. తమ కంపెనీలో కోడింగ్ ఇకనుంచి ఏఐ రాస్తుందని కొన్ని కంపెనీలు డైరెక్టుగా అనౌన్స్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో.. ఏఐ లీడ్ చేయగల సత్తా ఉంటే కోటి రూపాయల జీతం ఇస్తామని Smallest AI అనే బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ముందుకు రావటం చర్చనీయాంశంగా మారింది. 

Smallest AI అనే బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఒక కోటి రూపాయల ప్యాకేజీతో ఫుల్-స్టాక్ లీడ్ పోస్ట్ కోసం ప్రకటన ఇచ్చింది. ఈ ఆఫర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ జాబ్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థికి ప్యాకేజీ కింద  రూ. కోటి ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ. 60 లక్షలు బేస్ శాలరీతో పాటు రూ. 40 లక్షల విలువలైన కంపెనీ ఈక్విటీని అందించనున్నట్లు ప్రకటించింది. ఐదు రోజులు ఆఫీస్ లో పనిచేసే ఫుల్ టైమ్ జాబ్ గా కంపెనీ అనౌన్స్ చేసింది. 

ఇతర జాబ్స్ కు కావాల్సిన రెజ్యూమ్, క్వాలిఫికేషన్, చెక్ లిస్ట్ కాకుండా అర్హతలు ఏంటో నాలుగు మాటల్లో చెప్పేశారు. కనీసం 4-5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని.. Next.js, Python, React.js లలో నైపుణ్యం ఉండాలని కంపెనీ సూచించింది. 0 నుండి 100 వరకు స్కేలింగ్ సిస్టమ్ అనుభవం ఉండాలని Smallest AI ఫౌండర్ సుదర్శన్ కామత్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ కంపెనీ డిగ్రీ లేదా రెజ్యూమ్ అవసరం లేదని.. స్కిల్స్, ఎక్స్పీరియన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

ALSO READ : హెచ్ఏఎల్లో టెక్నీషియన్ పోస్టులు.. డిప్లొమా ఉన్నోళ్లకే జాబ్.!

అభ్యర్థులు తమ గురించి 100 పదాల పరిచయంతో పాటు, అంతకు ముందు చేసిన వర్క్ ఎక్సీపీరియన్స్, ప్రాజెక్టులను info@smallest.ai కు "Cracked Full Stack Lead" అనే  టైటిల్ తో పంపాలని సూచించారు. 

సుదర్శన్ కామత్ ఈ జాబ్ ఆఫర్ గురించి పోస్ట్ చేసిన వెంటనే ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ న్యూస్. 60 వేల వ్యూస్ తో పాటు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ క్రియేట్ చేసింది. ఇది చాలా గొప్ప అవకాశం అని కొందరు అంటుంటే.. ఫ్యూచర్ హైరింగ్స్ అన్నీ ఇలాగే ఉంటాయేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రెజ్యూమ్, డిగ్రీలు కాకుండా.. స్కిల్స్ మీద ఫోకస్ చేయడం బాగుందని కొందరు రిప్లై ఇస్తున్నారు.