
హైదరాబాద్ : దసరా, దీపావళి పండుగలప్పుడు పూలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. దీని దృష్ట్యా రైతులు బంతి, చామంతి తదితర రకాల పూలను ఎక్కువగా పండిస్తుంటారు. పండుగలకు ముందు వివిధ ప్రాంతాలను నుంచి తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఈసారి దసరా తర్వాత పూల కొనుగోలు భారీగా పడిపోయింది. దీంతో కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్లో కొనేవారు లేకపోవడంతో పాటు రేటు లేక పూలు వాడిపోతుండడంతో వ్యాపారులు బస్తాల కొద్దీ పూలను పారబోస్తున్నారు. బుధవారం చెత్తకుప్పలో పోసిన పూలను బర్రెలు తింటూ ఇలా కనిపించాయి. - ఫొటోగ్రాఫర్, వెలుగు