సిద్దిపేటోడి పెత్తనం ఇక్కడ అవసరమా? : రేవంత్

సిద్దిపేటోడి పెత్తనం ఇక్కడ అవసరమా? : రేవంత్

రుద్రారం గ్రామానికి ఒక ఉద్యమ చరిత్ర ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. దుబ్బాక ఎన్నిక ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్..దుబ్బాక, సిద్దిపేటకు 30 ఏళ్లుగా గా దాయాదుల పోరు నడుస్తోందన్నారు.అప్పుడు కేసీఆర్ ను ఎదిరించి దుబ్బాక ను ముత్యంరెడ్డి అభివృద్ధి చేశారు..ఇప్పుడు హరీష్ రావు ను ఎదిరించి శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి చేస్తారన్నారు. అయినా దుబ్బాక లో దమ్మున్న నాయకుడు లేడా..సిద్దిపేటోడు ఇక్కడ పెత్తనం చేసుడు అవసరమా అని అన్నారు. ఏడేళ్ల నుండి హరీష్ మంత్రిగా ఉండి చేయని అభివృద్ధి.. ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు. TRS లో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు దుబ్బాక గెలినా చేసేది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నాలుగు కోట్లు ప్రజలు ఆనందిస్తారన్నారు రేవంత్ రెడ్డి.