డ్రైవర్ లేకుండా గూడ్స్ రైలు పరుగులు గంటలకు 100స్పీడ్తో..84 కిలోమీటర్లు.. ఎలా ఆపారంటే..

డ్రైవర్ లేకుండా గూడ్స్ రైలు పరుగులు  గంటలకు  100స్పీడ్తో..84 కిలోమీటర్లు.. ఎలా ఆపారంటే..

డ్రైవర్ లేకుండా గూడ్స్ రైలు పరుగులు పెట్టింది. 100 కిలోమీ టర్ల అతి వేగంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 84 కిలో మీటర్లు ప్రయాణించింది. రైలు ఆపేందుకు రైల్వే అధికారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతికష్టం మీద రైల్వే సిబ్బంది ఆ రైలు ఆపారు. టైం బాగుండి ఎలాంటి ప్రమాదం జరగలేదు.. పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

కాశ్మీర్ లోని కథువా స్టేషన్ లో చాయ్ తాగేందుకు డ్రైవర్, కో డ్రైవర్ రైలును ఆపారు. ఇంజిన్ ఆన్ ఉంచి వెళ్లారు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో సమీప ప్రాంతమైన పఠాన్ కోట్ వైపు ఏటవాలు ఉండటంతో రైలు మెల్లిగా కదిలి స్పీడ్ పెంచేసింది. ఇక దాని వెంట రైల్వే అధికారులు పరుగులు పెట్టారు.  కాంక్రీట్ లోడు వెళ్తున్న గూడ్స్ రైలు.. దాదాపు 84 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా రైలు ప్రయాణించింది. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ వింత ఘటన జరిగింది.  ప్యాసింజర్ రైళ్లోని డ్రైవర్లు, సిబ్బంది సహాయంలో దుసుహా సమీపంలోని ఉచి బస్తీ ప్రాంతంలో రైలును ఆపడానికి రైల్వే అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి. చివరికి చెక్క మొద్దులు అడ్డం పెట్టి అతికష్టం మీద రైలు ఆపారు. 

డ్రైవర్ లేకుండా గూడ్స్ రైలు ప్రయాణిస్తున్న సయమంలో ఎదురుగా దాని ట్రాక్ పై రైళ్లు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో రైల్వే శాఖ విచారణ కు ఆదేశించింది.