రెండు నెలలు కరెంటు బిల్లులు, బ్యాంక్ రికవరీలు బంద్

రెండు నెలలు కరెంటు బిల్లులు, బ్యాంక్ రికవరీలు బంద్

కరోనా వైరస్ వ్యాప్తితో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది జీవనోపాధిని కోల్పోతున్నారు. ఈ క్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల వరకు కరెంట్ బిల్లులను వసూలు చేయడం లేదని చెప్పారు. పెండింగ్ బిల్లులు కట్టాలనే ఒత్తిడి కూడా ఉండదని అన్నారు. ఇదే సమయంలో బ్యాంకులకు కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రజలు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారి నుంచి లోన్ల రికవరీని బంద్ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తారని తెలిపారు. 

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంపై పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు.  రాష్ట్రానికి వెయ్యి టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను, 75 లక్షల డోసుల వ్యాక్సిన్లను పంపాలంటూ ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు.