ఓటర్ జాబితాలో తప్పులు ఉండొద్దు : మున్సిపల్ కమిషనర్ నాగరాజు

ఓటర్ జాబితాలో తప్పులు ఉండొద్దు : మున్సిపల్ కమిషనర్ నాగరాజు

కోస్గి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన ఓటరు డ్రాఫ్ట్ జాబితాలో తప్పులు ఉండొద్దని మున్సిపల్ కమిషనర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై ఆల్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటరు జాబితాపై పలు ఫిర్యాదులు అందాయని, వాటన్నింటిపై సర్వే చేసి తప్పులుంటే సరిదిద్దాలని సూచించారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. 

పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తాం

కొల్లాపూర్, వెలుగు : పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం కొల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉంటే.. అందులో కొందరు చనిపోయినవారు ఉన్నారని, వారి పేర్లను జాబితా నుంచి తొలిగించాలన్నారు. ఒకే కుటుంబానికి చెందినవారంతా ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్​నాయకులు తదితరులు పాల్గొన్నారు.