సుశీ ఇన్ ఫ్రా నుంచి డబ్బుల బదలాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పింది. 5కోట్ల 24లక్షల రూపాయలను.. వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. ‘‘ టీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చింది కానీ... అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు’’ అని ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది.
బీజేపీ నాయకులు డబ్బులను మునుగోడు పరిధిలోని వ్యక్తులకు చెందిన వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో జమచేశారని మంత్రి కేటీఆర్ పదే పదే చెప్పారు. అయితే ఈ ఆరోపణలను సుశీ ఇన్ ఫ్రా ఎండీ సంకీర్త్ రెడ్డి మొదటినుంచీ ఖండిస్తున్నారు. తమ కంపెనీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు కావాలనే ఈ విధంగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. డబ్బుల మళ్లింపుపై ఆధారాలు లేవని ఈసీ చెప్పడంతో.. మునుగోడు బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డికి ఊరట లభించినట్టు అయింది.
