సడలింపులు ఇవ్వకపోతే గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు కష్టమే

సడలింపులు ఇవ్వకపోతే గవర్నమెంట్ ఉద్యోగులకు  జీతాలు కష్టమే

న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా నెలరోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ ఎత్తివేస్తారో లేదా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇది చాలా రాష్ట్రాలను భయపెడుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాయి. దీంతో పలు రాష్ట్రాల ఆదాయ పరిస్థితులపై ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ స్టడీ చేసింది. మే 3 వరకు ఎలాంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ కొనసాగిస్తే నాలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు తప్పవంట. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి ఆయా రాష్ట్రాలకు ఉంటుందంట. హిమచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, యూపీ లో గవర్నమెంట్ కు ఆదాయం భారీగా పడిపోయింది. కొన్ని సడలింపు ఇస్తే ప్రభుత్వానికి కాస్త ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఇప్పటికే కొన్ని రంగాలను లాక్ డౌన్ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. ఐతే ప్రధానంగా ఆదాయం వచ్చే రంగాలపై ఆంక్షలు కొనసాగుతుండటం ఆయా రాష్ట్రాలకు ఇబ్బందిగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఏర్పడుతున్న నష్టాన్ని వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ భర్తీ చేసుకునేందుకు డబ్ల్యూఎంఏ లిమిట్ ను రిజర్వ్ బ్యాంక్ పెంచింది. అయినప్పటికీ పలు రాష్ట్రాలకు లోటు తప్పదని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ స్టడీ లో తేలింది.