పాత వంద నోట్ల రద్దులో నిజమెంత?

పాత వంద నోట్ల రద్దులో నిజమెంత?

భారత్‌లో నవంబర్ 8, 2016న రూ. 500, రూ. 1000 నోట్లను డీమానిటైజేషన్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో పాత రూ. 100 నోట్లు, రూ. 10, రూ. 5 నోట్లను కూడా డీమానిటైజేషన్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలపై ఆర్బీఐ స్పందించింది. పాత నోట్లను రద్దు చేస్తున్నామనే వాదనలో నిజంలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అసలు అటువంటి ఆలోచనలు కూడా తమకు లేవని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే పాత నోట్ల రద్దుపై వస్తున్న ప్రచారంపై ఆర్బీఐ అధికారికంగా ఇంకా స్పందించలేదు.

కాగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్.. జిల్లా స్థాయి భద్రతా కమిటీ మరియు జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. పాత రూ. 100, రూ. 10, రూ. 5 నోట్లను మార్చి-ఏప్రిల్ నాటికి ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు ఆయన అన్నారు. దాంతో పాత నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఆర్బీఐ కొత్త వంద రూపాయల నోట్లను 2019లో విడుదల చేసింది. గతంలో ఉన్న పాత వంద రూపాయల నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ అప్పుడే పేర్కొంది. కాగా.. రూ. 2000 నోటు ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ.. దాని స్థానంలో కొత్త రూ. 200 నోటును ప్రవేశపెట్టింది. పది రూపాయల నాణాన్ని ప్రవేశపెట్టి 15 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా వ్యాపారులు ఆ నాణాన్ని తీసుకోవడంలేదు. దాంతో పది రూపాయల నాణెం విషయంలో బ్యాంకులు, ఆర్బీఐకి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నాణెం మీద రూపాయి చిహ్నం లేకపోవడంతో దుకాణదారులు ఆ నాణాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

For More News..

కరీంనగర్‌లో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

పులిని వండుకుతిన్న వేటగాళ్లు..

బుద్దిమారని పాక్.. బార్డర్‌లో బయటపడ్డ భారీ సొరంగం