
హైదరాబాద్: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్-1తో భయం లేదని డీఎంఈ డాక్టర్ త్రివేణి అన్నారు. ఒమిక్రాన్ ప్రభావమే తక్కువ అని, ఇప్పుడు దాని సబ్ వేరియంట్ జేఎన్-1 ప్రభావం ఇంకా తక్కువగా ఉందని డీఎంఈ తెలిపారు. జేఎన్1 వచ్చిన వారికి గతంలో లాగా ఆక్సిజన్ ఎమర్జెన్సీ ఉండదన్నారు. ఇకవేళ అత్యవసరమైతే వాటిని రెడీగా ఉంచామన్నారు. అనుమానం ఉన్నవారికి ప్రతి రోజు టెస్టులు చేస్తున్నామన్నారు. తక్కువ మందిలో కోవిడ్ నిర్ధారణ అవుతోందన్నారు.
ఉస్మానియా, చెస్ట్, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డాక్టర్ త్రివేణి చెప్పారు. అవసరమైన వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రోగుల కోనసం ఆక్సిజన్, బెడ్స్ అన్నింటిని సిద్ధం చేశామని తెలిపారు. కొంత మంది డాక్టర్స్ జేఎన్1 బారిన పడ్డారన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం క్షేమంగానే ఉందన్నారు. న్యూ ఇయర్ వేడుకల తర్వాత కేసులు పెరిగే అవకాశ ఉందని డీఎంఈ అభిప్రాయపడ్డారు. మొదట్లో కొవిడ్ అంటే చాలా భయం ఉండదేని, కానీ ఇప్పుడు జనాలు కొవడ్ సబ్ వేరియంట్‌ను లైట్ తీస్కుంటున్నారని చెప్పారు. జనాలు లైట్ తీసుకోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని డీఎంఈ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో జనం గుంపులుగా ఉండొద్దని డీఎంఈ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు.