ప్రధాని మోడీకి భయపడే ప్రసక్తే లేదు

ప్రధాని మోడీకి భయపడే ప్రసక్తే లేదు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ)​ చర్యలకు బెదిరేది లేదన్నారు. యంగ్​ ఇండియన్​ ఆఫీస్​ను మూయించడంతో మోడీపై రాహుల్​ గాంధీ మండిపడ్డారు. ఇండ్ల ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైనా విమర్శలు గుప్పించారు.

గురువారం పార్లమెంట్​ ఎదుట రాహుల్​ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈడీతో కేంద్రం ఎన్ని బెదిరింపులకు దిగినా వెనుకడుగు వేయం. మోడీని చూసి భయపడే ప్రసక్తే లేదు. నేను ఏం చెబుతున్నానో.. మీకు అర్థం అవుతుందా?” అంటూ ఫైర్​ అయ్యారు. “వారు ఏం చేయాలని అనుకుంటున్నారో.. చేయనివ్వండి.. మేం ఏం చేయాలో అది చేస్తాం. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఎప్పుడూ రాజీపడను. ఎన్ని బారికేడ్లు అడ్డంగా పెట్టినా.. ఎవరూ నిజాన్ని దాచలేరు” అని ఆయన కామెంట్ చేశారు.