14 రోజులుగా 27 జిల్లాల్లో జీరో క‌రోనా కేసులు.. తెలంగాణ‌లో ఒక జిల్లా

14 రోజులుగా 27 జిల్లాల్లో జీరో క‌రోనా కేసులు.. తెలంగాణ‌లో ఒక జిల్లా

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ స‌హా ఇత‌ర చ‌ర్య‌లు ఫ‌లితాల‌నిస్తున్నాయి. కంటైన్మెంట్ జోన్ల గుర్తించి వైర‌స్ వ్యాప్తి నిరోధానికి అనుస‌రిస్తున్న విధానాలతో ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించ‌కుండా నియంత్రిస్తున్నాయి ప్ర‌భుత్వాలు. దీని ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 325 జిల్లాల్లో ఏ ఒక్క‌రికీ క‌రోనా సోక‌కుండా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాయి. అలాగే గ‌డిచిన 28 రోజులుగా పుదుచ్చేరిలోని మ‌హె జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. మ‌రో 27 జిల్లాల్లో గ‌డిచిన 14 రోజులుగా ఎవ‌రికీ కొత్తగా వైర‌స్ సోక‌లేదు.

తెలంగాణ‌లో ఒక జిల్లా

ఈ 27 జిల్లాల్లో తెలంగాణ నుంచి కొత్త‌గూడెం భ‌ద్రాద్రి జిల్లా ఉండ‌డం కొంత ఊర‌ట‌నిస్తోంది. అత్య‌ధికంగా క‌ర్ణాట‌క‌లో 5 జిల్లాలు ఈ కేట‌గిరీలో ఉన్నాయి. ఛ‌త్తీస్ గ‌ఢ్ లో మూడు జిల్లాలు, గుజ‌రాత్, కేర‌ళ‌, పంజాబ్, హ‌ర్యానాల్లో రెండేసి చొప్పున జిల్లాల్లో గ‌డిచిన 14 రోజులుగా కొత్త క‌రోనా కేసులు లేదు. తెలంగాణ స‌హా బిహార్, ప‌శ్చిమ బెంగాల్, రాజ‌స్థాన్, గోవా, ఉత్త‌రాఖండ్, యూపీ, జ‌మ్ము క‌శ్మీర్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, మ‌ణిపూర్, మిజోరంల‌లో ఒక్కో జిల్లాలో రెండు వారాలుగా కొత్త‌గా ఎవ‌రికీ క‌రోనా సోక‌కుండా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాయి రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

రాష్ట్రాలు, జిల్లా లిస్ట్ ఇదీ:

No fresh Covid-19 cases reported in 27 districts of India during the last 14 days