టెన్షన్ వద్దు.. కావాల్సినంత పెట్రోల్, డీజిల్ ఉంది : డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ

టెన్షన్ వద్దు.. కావాల్సినంత పెట్రోల్, డీజిల్ ఉంది : డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్​:  రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న భారీ రద్దీపై అసోసియేషన్ పూర్తి స్థాయి వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం..ఈ తప్పుడు వార్తల వల్లే ప్రజలు ఆందోళనకు గురై ఒకేసారి బంకులకు పరుగులు తీస్తున్నారు.భయాందోళనతో జనం భారీగా రావడంతో, సాధారణ రోజుల కంటే ఇప్పుడు విక్రయాలు 2 నుంచి 3 రెట్లు పెరిగాయి. దీనివల్ల కొన్ని బంకుల్లో నిల్వలు త్వరగా అయిపోతున్నాయని తెలిపింది.

HPCL, IOCL, BPCL కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయని, పెట్రోల్​, డీజిల్​ సరఫరా సాధారణంగానే ఉందని స్పష్టం చేసింది అసోసియేషన్. విపరీతమైన రద్దీ  వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా నిల్వలు అయిపోతున్నాయి తప్ప, అసలైన కొరత లేదని తెలిపింది. 

విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని బంకుల్లో స్టాక్ అయిపోవడాన్ని చూసి కొరత ఉందనుకోవద్దు.. అది కేవలం పెరిగిన డిమాండ్ వల్ల తలెత్తిన తాత్కాలిక సమస్యే తప్ప, సరఫరాలో లోపం కాదని క్లారిటీ ఇచ్చింది.