పండ్ల మొక్కలు పెంచనీకి పైసలొస్తలేవ్

పండ్ల మొక్కలు పెంచనీకి పైసలొస్తలేవ్

హార్టికల్చర్​ సెంటర్లపై సర్కారు నిర్లక్ష్యం

రెండేళ్ల నుంచి మెయింటెనెన్స్ ఫండ్స్ ఇవ్వని ప్రభుత్వం
మొక్కలు పెంచట్లే..
రైతులకు శిక్షణ ఇవ్వట్లే

కామారెడ్డి, వెలుగు: ఉద్యానపంటల సాగును ప్రోత్సహించేందుకు వివిధ జిల్లాల్లో ఏర్పాటుచేసిన హార్టీకల్చర్ సెంటర్లకు రెండేళ్లుగా ఫండ్స్​ వస్తలేవు. దీంతో సరిపడా పండ్లు, కూరగాయల మొక్కలను పెంచలేక,  రైతులకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వలేక ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు. దీని ఎఫెక్ట్​ రాష్ట్రంలో తోటల పెంపకంపై పడుతున్నది. మొక్కలు బయట అధిక ధరలకు కొనలేక, అవసరమైన ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లేక రైతులు క్రమంగా హార్టీకల్చర్​కు దూరమవుతున్నారు. ఉన్న పండ్ల తోటలనూ ధ్వంసం చేసి పత్తి, కంది, ఇతర పంటల వైపు మళ్లుతున్నారు. దీంతో పండ్లకు, కూరగాయలకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.

తొమ్మిది చోట్ల హార్టీకల్చర్​ సెంటర్లు

కామారెడ్డి జిల్లాలోని మాల్​తుమ్మెద, కరీంనగర్​ జిల్లా రుక్మాపూర్,  మంచిర్యాల జిల్లా  కర్నాల్, భదాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడు, ఖమ్మంజిల్లా ఆశ్వారావుపేట, మహబూబ్​నగర్​లోని పిల్లల మర్రి,  సిద్దిపేట జిల్లాలోని ములుగు, మెదక్​ జిల్లా నత్నాయపల్లి,  రంగారెడ్డి జిల్లాలోని జీడిమెట్లలో  ఉద్యాన మొక్కల ఉత్పత్తి, అధునాతన శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ సెంటర్లలో వివిధ పండ్లు, కూరగాయల మొక్కలను పెంచాలి. మేలైన వంగడాలకు అంట్లు కట్టి రైతులకు తక్కువ ధరకు అందించాలి. ఆయా సెంటర్ల పరిధిలో రైతులకు అధునాతన పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, పూలు ఎలా సాగుచేయాలో తరచూ ట్రైనింగ్​ ఇవ్వాలి. గతంలో ఏటా లక్షో, రెండు లక్షలో ఫండ్స్​ కేటాయించినప్పటికీ 2019–-20,2020–-21లో  పైసా కూడా సర్కారు ఇవ్వలేదు. దీంతో నర్సరీల్లో పండ్లు, కూరగాయల మొక్కల పెంపకాన్ని ఆఫీసర్లు ఆపేశారు. కొన్ని సెంటర్లలో  తోటలను లీజ్​కిస్తూ వచ్చిన ఫండ్స్​తో లేబర్​కు జీతాలు చెల్లిస్తున్నారు. కానీ ఏ సెంటర్​ పరిధిలోనూ రైతులకు ట్రైనింగ్​ ఇవ్వట్లేదు.  కొన్ని జిల్లాల్లో ఇలాంటి సెంటర్లు ఉన్నాయనే విషయమే రైతులకు తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కామారెడ్డి జిల్లాలో ఇలా..

కామారెడ్డి జిల్లాలోని మాల్​తుమ్మెద హార్టీకల్చర్​ సెంటర్​కు  2018-19 లో రూ.2 లక్షల ఫండ్స్​ ఇచ్చారు.  ఈ సెంటర్​కు 60 ఎకరాల భూమి  ఉంది . 20 ఎకరాల్లో మామిడి తోట, 2 ఎకరాల్లో జామ తోట, ఎకరంలో  దానిమ్మ తోట సాగవుతోంది.  హార్టీకల్చర్​ ఆఫీసర్​ కింద  ఇద్దరు లేబర్​ పని చేస్తున్నారు.  ప్రభుత్వం నుంచి ఫండ్స్​ రాక వీరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది.  దీంతో రెండేళ్లుగా  మొక్కల ఉత్పత్తి  నిలిపేశారు.  పండ్లతోటలను వేలం వేయడం ద్వారా వస్తున్న ఫండ్స్​తో  లేబర్​కు జీతాలు ఇస్తున్నారు.  ఆకుకూరల సాగు కోసం వేసిన షేడెట్​ నెట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. నర్సరీలు, పండ్ల తోటల పెంపకం కోసం  ఫండ్స్​ కావాలని ఏటా ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపుతున్నా పైసలు రావట్లేదని ఆఫీసర్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

20 ఏండ్ల నుంచి డైట్ కాలేజీల్లో రిక్రూట్​మెంట్​ బంద్​

మా బతుకులతో ఆడుకుంటున్నరు.. నర్సింగ్​ అభ్యర్థుల ఆందోళన

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు