అమెరికా H-1B వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్వర్తులు జారీ చేశారు. ఈ వన్ టైమ్ ఫీజు చెల్లింపులు సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వచ్చాయి. అమెరికన్ల ఉద్యోగ కల్పన, అధికవేతనాల నుంచి పరిష్కారం, స్కిల్స్ ఉన్న టెక్కీలకు మాత్రమే స్పాన్సర్ షిప్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది..అయితే ఇలాంటి నిబంధనలు పెడితే అమెరికాలో టెక్ రంగం పరిస్థితి ఏమవుతుంది.. ప్రస్తుతం అమెరికా టెక్ కంపెనీల్లో సాఫ్ట్ వేర్ దిగ్గజాలుగా ఉన్న సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వాళ్లు కూడా గతంలో H1B వీసాపై వారే కదా.. ఇది అమెరికా ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోగలదా, USలో కార్పొరేట్ భవిష్యత్తు నాయకత్వంపై ప్రభావం చూపదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ప్రతి సంవత్సరం దాదాపు 85వేల కొత్త H1B వీసాలను జారీ చేస్తుంది అమెరికా ప్రభుత్వం.. గత లెక్కల ప్రకారం ఇందులో మూడు వంతులు భారతీయ పౌరులకే లభిస్తున్నాయి. దశాబ్దాలుగా H1B వీసాల ద్వారా అమెరికన్ కంపెనీలకు భారత్ నుంచి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, మేనేజర్లు వెళ్తున్నారు. వీరంతా ఇప్పుడు అక్కడ సంస్థల్లో సీనియర్లు.. వారు అక్కడి కంపెనీలను శాసించే స్థాయికి వెళ్లారు.
H-1B ప్రతిభపై కార్పొరేట్ ఆధారపడటం..
H1B వీసాలకు అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్స్ గా ఉన్నాయి .అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్ లాంటి దిగ్గజ సంస్థలు తమ వర్క్ ఫోర్స్ ను H1B వీసాల ద్వారానే తెచ్చుకుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ల తయారీ వంటి రంగాల్లో కీరోల్స్ మాన్ పవర్ ను నింపేందుకు ఈ వీసాలే వీలు కల్పిస్తాయని ఈ సంస్థలు వాదిస్తున్నాయి.
స్పెషల్ స్కిల్స్ ను ఆకర్షించేందుకు స్టార్టప్ లు కూడా H1B వీసాలపైనే ఆధారపడతాయి. ట్రంప్ H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో భవిష్యత్ సాఫ్ట వేర్ నాయకత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ట్రంప్ నిర్ణయంతో ప్రతి నెలా 5500 లకు పైగా, ఏటా 60వేలకు పైగా స్కిల్డ్ టెక్కీలను రాకను అడ్డుకోవచ్చని JP మోర్గాన్ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది యూఎస్ లో టెక్కీల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. రాబోయే రోజుల్లో సీనియర్ మేనేజ్ మెంట్ లోకి ఎదిగే టెక్కీల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
ఇక యూఎస్ లో కంపెనీలకు ఖర్చు భారం పెరుగుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఇది కంపెనీలు అమెరికానుంచి విదేశాలకు తరలివెళ్లేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. భారత్, కెనడా, ఈస్ట్ యూరప్ వంటి కొత్త ఇంజనీరింగ్ హబ్ లపై కంపెనీలు తమ ప్రయాణాన్ని సాగించే అవకాశం ఉందంటున్నారు.
