V6 News

నో హెల్మెట్.. నో ఎంట్రీ!

నో హెల్మెట్.. నో ఎంట్రీ!
  • రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్​ ఆఫీసుల్లో ఆంక్షలు
  • అరైవ్​ అలైవ్​లో భాగంగా అవగాహన కార్యక్రమాలు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ గవర్నమెంట్​ ఆఫీసుల్లో పని చేసే అధికారులు, సిబ్బంది బైక్​లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని పోలీసు శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం అరైవ్​ అలైవ్​లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆఫీసులతో పాటు పోలీస్​స్టేషన్లలో అవేర్నెస్​ ప్రోగ్రాంలు నిర్వహించారు. హెల్మెట్​ పెట్టుకోని వారికి ఆఫీసుల్లోకి ప్రవేశం లేదంటూ నో హెల్మెట్,​నో ఎంట్రీ స్లోగన్లు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.

చెన్నూర్  తహసీల్దార్​ ఆఫీస్​లో సీఐ బన్సీలాల్​ ఆధ్వర్యంలో జరిగిన ​ప్రోగ్రాంలో కలెక్టర్​ కుమార్​ దీపక్​ పాల్గొన్నారు. మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఆధ్వర్యంలో డీసీపీ ఆఫీస్​లో నో హెల్మెట్​ నో ఎంట్రీ ప్రోగ్రాం నిర్వహించారు. డీసీపీ ఆఫీస్​తో పాటు పోలీస్ స్టేషన్లలో పని చేసే సిబ్బంది హెల్మెట్  లేకుండా వస్తే లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పెట్రోల్​ బంకుల్లోనూ బోర్డులు పెట్టారు.