ఆ గ్రామాల్లో హోలీ సంబరాలు  చేసుకోరట... ఎక్కడ.. ఎందుకంటే..! 

ఆ గ్రామాల్లో హోలీ సంబరాలు  చేసుకోరట... ఎక్కడ.. ఎందుకంటే..! 

హోలీ పండుగ రోజు వీధులన్నీ రంగులమయం... ఎవరి చేతిలో చూసిన కలర్స్​.. ఎక్కడ చూసినా కేరింతలు కొడుతూ  రంగులు జల్లుకుంటారు.   కాని ఓ మూడు గ్రామాల్లోని ప్రజలు హోలీ పండుగకు దూరంగా ఉంటారు. రంగులు జల్లుకోరట.హోలీ వేడుకలకు దూరంగా ఉంటారట.  ఆ మూడు గ్రామాల ప్రజలు హోలీ ఆడేందుకు ధైర్యం చేయరు.. హొలీ నిషేధం అనే సంప్రదాయం కొనసాగుతోంది.. ఆ గ్రామాల్లో ఎందుకు హోలీ ఆడరో తెలుసుకుందాం. .  . . 

రంగుల పండుగ హోలీని దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు.  కానీ ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల వారు మాత్రం హోలీ వేడుకలకు దూరంగా ఉంటారు. ఓ మూడు  గ్రామాల్లో హోలీ రంగులు అడుగు పెట్టవు.  ఎప్పటినుంచో కొనసాగుతున్న ఈ ఆచారం నేటికీ కొనసాగుతుంది.  ఈ గ్రామాలలో హోలీ రంగులు అశుభంగా భావిస్తారు.  హోలీ జరుపుకుంటే  దేవుడికి కోపం వస్తుందని ఆ ఊరి ప్రజలు నమ్ముతుంటారు. 

ఉత్తరాఖండ్​ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో క్వేలి, కుర్జాన్ , జోండ్ల అనే మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో  హోలీ ఆడరు... రంగులు జల్లుకోరు.  హోలీని జరుపుకోకపోవడానికి కారణం భూమ్యాల్ దేవుడు, కులదేవి ఇచ్చిన శాపమని భావిస్తుంటారు.  ఇక్కడి గ్రామ దేవత భూమ్యాల్ దేవి... కుల దేవతలుగా నంద దేవి, త్రిపుర సుందరి.గ్రామంలో ఎవరైనా హోలీ జరుపుకుంటే భూమ్యాల్ దేవతలకు కోపం వస్తుందని ఒక నమ్మకం. హోలీ ఆడితే ఈ గ్రామాల్లోని  మనుషులు, జంతువులు  భయంకరమైన వ్యాధులతోవ్యాపించి మరణిస్తారని విశ్వాసం. చాలా సంవత్సరాల క్రితం గ్రామస్తులు హోలీని జరుపుకోవడానికి ప్రయత్నించారని.. అయితే అప్పుడు గ్రామంలో కలరా అనే వ్యాధి వ్యాపించి చాలా మంది మరణించారని చెబుతారు.

రుద్రప్రయాగ్‌లోని అగస్త్యముని బ్లాక్‌లోని తల్లనాగ్‌పూర్ బెల్ట్‌లోని క్వేలీ, కుర్జాన్ , జోండ్ల గ్రామాలు హోలీ సంబరాలకు  దూరంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు హోలీ ఆడరు అంతేకాదు కనీసం  ఒకరిపై ఒకరు రంగులు జల్లుకోరు. 350 ఏళ్ల క్రితం ఇక్కడ హోలీ  ఎవరైనా ప్రయత్నిస్తే..  చాలా మంది అకాల మరణం చవిచూడాల్సి వచ్చిందని చెబుతారు. ఈ ఘటన రెండుసార్లు జరిగిందనీ.. అప్పటి నుంచి  హోలీ ఆడేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ గ్రామాల్లోని కొంతమంది  హోలీని జరుపుకోవాలనుకున్నా.... హోలీ ఆడిన తర్వాత వ్యాధులు వస్తాయనే పుకార్లకు భయపడతారు.

గ్రామస్తులు ఏమంటున్నారంటే...

రుద్రప్రయాగ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వేలీ, కుర్జాన్ , జౌండ్ల గ్రామాల్లో  సుమారు 350 సంవత్సరాల క్రితం.... జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కొన్ని పూజారి కుటుంబాలు జాజ్‌మాన్‌లు , రైతులతో కలిసి ఇక్కడ స్థిరపడ్డారని ఇక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. ఈ వ్యక్తులు తమతో పాటు అధిష్టాన దేవత త్రిపుర సుందరి విగ్రహం, పూజా సామగ్రిని కూడా తీసుకువచ్చారట. గ్రామంలో అమ్మవారిని ప్రతిష్టించారు. తల్లి త్రిపుర సుం...వైష్ణో దేవి సోదరిగా భావిస్తారు. అంతేకాదు మూడు గ్రామాలకు అధిపతి అయిన భేల్ దేవ్ కూడా పూజిస్తారు. కులదేవి, అధిష్టాన దేవత భెల్ దేవ్ హోలీ సందర్భంగా ప్రజల సందడి , రంగులను ఇష్టపడరని ప్రజలు చెబుతారు. అందుకే హోలీని జరుపుకోరనే సంప్రదాయం ఉందని స్థానికులు చెబుతుంటారు. .

పాతికేళ్ల క్రితం గ్రామంలో హోలీ ఆడినప్పుడు కలరా వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడి చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులు ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. హోలీ ఆడడం వల్లే గ్రామంలో ఇదంతా జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. కొంతమంది దీనిని దేవత తప్పుగా భావిస్తారు.. అయితే చాలా మంది ప్రజలు దీనిని భేల్ దేవ్ తప్పుగా భావిస్తారు.  సమీప గ్రామాల్లోని ప్రజలు  హోలీని  వైభవంగా.. రంగులు జల్లుకుంటూ రంగులతో ఆడతారు.