హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో చార్జీలు తక్షణమే పెంచుతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) స్పష్టం చేసింది. మెట్రో రైల్వేస్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకే చార్జీల సవరణ ఉంటుందని తెలిపింది.
ఈ క్రమంలో 2022 సెప్టెంబర్ 5న జస్టిస్ (రిటైర్డ్) గుడిసేవ శ్యామ్ ప్రసాద్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా చార్జీల సవరణ 2025 మే 24 నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. ఇప్పట్లో మెట్రో చార్జీల పెంపు లేదని, ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని తేల్చిచెప్పింది
