ఇండియాలో లాస్ట్ విలేజ్.. 4జీ నెట్ వర్క్ కావాలంట

ఇండియాలో లాస్ట్ విలేజ్.. 4జీ నెట్ వర్క్ కావాలంట

దేశం మొత్తం 5జి నెట్ వర్క్ వినియోగిస్తున్న సమయం.. కానీ ఓ ఊళ్లో మాత్రం కనీసం 4జి సౌకర్యం కూడా లేదు. 21వ శతాబ్ధంలో.. అందులో టెక్ ప్రపంచంలో ఆ ఊళ్లో ఇంటర్నెట్ లేకపోవడం ఆ గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడి నివాసితులంతా ఇప్పటికీ 2జి నెట్ వర్క్ కూడా కలిగి ఉండకపోవడం విచారకరం.. ఇండోచైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న చివరి గ్రామం..మెరుగైన కనెక్టివిటీ కోసం నిరసన చేస్తున్నారు. 

ఇండో చైనా సరిహద్దు ప్రాంతం లఢాక్ లోని చివరి గ్రామమైన ఫోబ్రాంగ్ గ్రామంలో ఇప్పటివరకు  ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కనీసం 2జీ నెట్ వర్క్ కూడా లేదు. మెరుగైన కనెక్టివిటీ ఇవ్వాలని ..ప్రభుత్వం, టెలికం సర్వీస్ ప్రొవైడర్ తమ డిమాండ్ ను పరిశీలించి డిజిటల్ సేవలు అందించాలని కోరుతూ స్థానికులు ఎయిర్ టెల్ మొబైల్ టవర్ కింద నిలబడి శాంతియుతంగా నిరసన చేపట్టారు. అయితే అధికారులు వారి డిమాండ్ ను తీర్చేందుకు అంగీకరించి నట్లు తెలుస్తోంది.