
ఢిల్లీలో ఓ అపార్ట్‌మెంట్ యాజమాన్యం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవాళ్లు ..ఇకపై మగవాళ్లు లుంగీ కట్టుకోవద్దు, ఆడవాళ్లు నైటీ తొడుక్కోవద్దని సర్కులర్ జారీ చేశారు.
ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి? అనేది వ్యక్తిగత ఇష్టాలు. ఈ విషయంలో ఎవరూ ఎవర్నీ బలవంతం చేయలేరు. అయితే, వస్త్రధారణ అనేది ఎదుటి వారు మన గురించి మాట్లాడుకోకుండా ఉండాలనేది కొందరి వాదన. ప్రాంతీయ వైవిధ్యం, వాతావరణం, జీవనవిధానం, సంస్కృతితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వస్త్రధారణల ప్రభావంతో భారతీయ సమాజం పరిణామం చెందింది. అయితే, ఓ అపార్ట్‌మెంట్ సొసైటీ విధించిన డ్రస్ కోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గ్రేటర్ నోయిడాలో..
గ్రేటర్ నోయిడాలోని ఓ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామన్ ఏరియాల్లో తిరిగేటప్పుడు కాస్త పద్ధతిగా డ్రెసింగ్ చేసుకోవాలని ఆదేశించింది. నోయిడాలోని హిమ్‌సాగర్ అపార్ట్‌మెంట్‌లో ఈ రూల్ పెట్టారు. జూన్ 10వ తేదీన ఇందుకు సంబంధించి ఓ సర్క్యులర్ కూడా జారీ చేశారు. చాలా మంది పార్కింగ్, కామన్ ఏరియాల్లో పురుషులు లుంగీలతో, మహిళలు నైటీలతో తిరుగుతుండటం గమనించామని సొసైటీ ప్రతినిథులు తెలిపారు . ఇకపై ఇంకెప్పుడూ అలా కనిపించకూడదని తేల్చి చెప్పింది. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ఈ సర్క్యులర్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే వైరల్ అవడమే కాదు...పోలీసుల వరకూ వెళ్లింది వ్యవహారం. నెటిజన్లైతే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. "పర్సనల్ ఛాయిస్ ఉండదా" అని తిట్టి పోస్తున్నారు. డ్రెస్‌కోడ్ పేరుతో విడుదల చేసిన ఆ సర్క్యులర్‌ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో మీరు తిరిగే ప్రతిసారి మీ ప్రవర్తన, వేషధారణపై మీరందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. మీ ప్రవర్తనపై ఎవరికీ అభ్యంతరం చెప్పే అవకాశం ఇవ్వకండని .... అంటూ మీ పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుంటారు. నైటీ, లుంగీలను ఇంట్లో ధరించండి, ఫ్లాట్ల వెలుపల వాటిని ధరించకూడదని ప్రతి ఒక్కరూ అభ్యర్థించారని అని హింసాగర్ అపార్ట్‌మెంట్ కార్యదర్శి హరిప్రకాష్ జారీ చేసిన నోటీసులో తెలిపారు.
సర్క్యులర్‌లో ఏముందంటే..
ఈ సొసైటీలో మీరు ఎక్కడ తిరిగినా సరే మీ డ్రెసింగ్ ఎలా ఉందో ఓ సారి చూసుకోవడం మంచిది. మీ ప్రవర్తనతో పాటు డ్రెసింగ్ విషయంలోనూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కామన్ ఏరియాకి వచ్చినప్పుడు ఇంట్లో వేసుకునే లుంగీలు, నైటీలతో కనిపించడానికి వీల్లేదు. దయచేసి అర్థం చేసుకోండని సొసైటీ ప్రెసిడెంట్ తెలిపారు.
ఫిర్యాదులు వచ్చాయి
సొసైటీకి చెందిన కొంతమంది నుంచి ఫిర్యాదులు అందాయని, కొందరు పార్కుల్లో ఇలాంటి దుస్తులు వేసుకుని నడుస్తున్నారని, అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో వదులుగా ఉండే దుస్తులు ధరించి కొందరు నిత్యం యోగా చేస్తున్నారని, వాటిపై ఫిర్యాదులు వచ్చినందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని, తొలుత వారికి మౌఖికంగా చెప్పామని మార్పు రాకపోవడంతో సర్క్యులర్ జారీ చేశామని, ఇందులో ఎవరిపై వివక్ష చూపించడం లేదని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సీకే కల్రా చెప్పారు. తాము ఎవరి మనోభావాలను కించపరచలేదని, ఏ రకమైన దుస్తులను నిషేధించలేదని, ఇతరులకు అసౌకర్యంగా అనిపించే బట్టలతో తిరగవద్దని మాత్రమే అభ్యర్థించామని అన్నారు.
అందుకే ఈ నిర్ణయం..
అయితే దీనిపై విమర్శలు రావడం వల్ల సొసైటీ ప్రెసిడెంట్ స్పందించాల్సి వచ్చింది. ఇందులో తప్పేమీ లేదని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారాయన. మహిళలు నైటీలు వేసుకుని తిరిగితే పురుషులు కంఫర్ట్‌గా ఉండలేరు. అలాగే మహిళలు నైటీలతో తిరిగేతే పురుషులు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పరస్పరం గౌరవించుకోవాలన్నదే మా ఉద్దేశం అని సొసైటీ ప్రెసిడెంగ్ సీకే కల్రా తెలిపారు. సొసైటీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ దీన్ని గౌరవించాలి. ఇందులో వ్యతిరేకించడానికి ఏమీ లేదు.
భిన్నాభిప్రాయాలు
నెటిజన్లు మాత్రం "పాతకాలం మనుషుల్లా ఏంటిది" అని ప్రశ్నిస్తున్నారు. నైటీ, లుంగీతో పాటు కార్టూన్ ప్రింటెడ్ బాక్సర్ షార్ట్‌లు, ప్రింటెడ్ నైట్ సూట్‌లు, స్పోర్ట్స్‌వేర్‌ను కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది’ ఒకరు వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ వేర్‌ని కూడా బ్యాన్ చేస్తారా అంటూ మరి కొందరు మండి పడుతున్నారు. ఏ సొసైటీలోనూ ఇలాంటి రూల్స్ చూడలేదని స్థానికులు మండి పడుతున్నారు. ఇలాంటి రూల్స్ పెట్టే ముందు ఆలోచించరా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఖాప్ పంచాయతీ మాదిరిగా ఉందని మరో నెటిజన్ మండిపడ్డాడు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో దుస్తులకు చోటు లేదా? అని ఒకరంటే.. మనది విచిత్రమైన ప్రాధాన్యతలతో కూడిన సమాజం అని ఇంకొకరు ఇలా కామెంట్లు చేశారు.
మంచి నిర్ణయమేనంటున్న పొరుగువారు..
అసలు అపార్ట్‌మెంట్ యాజమాన్యం పెట్టిన సర్క్యులర్‌లో ఏముందంటే..మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు నచ్చినట్లుగా ఉండవచ్చు. నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. కాని బయటకు వచ్చినప్పుడు మాత్రం మర్యాద ఇచ్చే విధంగా మీ డ్రెస్ కోడ్ ఉండాలని నివాసితుల్ని వేడుకున్నారు. అంతే కాదు ఈ కండీషన్ ఫాలో కావాలని..లేకపోతే పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని చూసి నేర్చుకునే అవకాశం ఉందన్నారు. హిమసాగర్ అపార్ట్‌మెంట్స్ తీసుకున్న నిర్ణయానికి పక్కనే ఉన్న మరికొన్ని కమ్యూనిటీస్ కూడా మద్దతిచ్చాయి.
ఇప్పుడు గ్రామాల నుంచి మెట్రో నగరాల వరకు సాధారణ ప్రజలు మొదల్కొని సంపన్నుల వరకు స్త్రీ, పురుషుల వస్త్రాధారణ అంతా కామన్ అయిపోయింది. సౌకర్యం కోసమో లేక ఇంట్లోనే కదా ఉండేది అనే ఫీలింగో తెలియదు కానీ..ఆడవాళ్లు నైటీలు, మగవాళ్లు లుంగీలు ధరించడం సర్వసాధారణమైపోయింది. ఈవిధమైన డ్రెస్‌కోడ్ మన దేశంలో చాలా రాష్ట్రాలు, ప్రాంతాల్లో యూనివర్సల్‌గా మారిపోయింది. కాని దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దం. గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ ఎఫ్ 2లో అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఫ్లాట్ బయట తిరిగే సమయంలో కాలనీ వాసులు లుంగీలు, నైటీలు వేసుకోవద్దంటూ సర్క్యులర్ జారీ చేసింది. ఎవరైనా నిబంధనల ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం వివాదానికి కారణమైంది