ఏపీ ఆర్టీసీ ఊసులేని సీఎం ప్రకటన

ఏపీ ఆర్టీసీ ఊసులేని సీఎం ప్రకటన

ఆర్టీసీలో వేలాది కార్మికులకు తీసేస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలో ఒక ఆసక్తికరమైన అంశం కనిపించింది. చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీనే లేదంటూ, కర్నాటక తర్వాత మన రాష్ట్రంలోనే ఎక్కువ బస్సులు నడుపుతున్నామని కేసీఆర్ ప్రకటనలో ప్రస్తావించారు. అయితే చాలా రాష్ట్రాల ప్రస్తావన ఉన్న ఈ ప్రెస్ నోట్ లో ఎక్కడా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. ఆర్టీసీని ప్రభుత్వం కిందికి తెస్తామని ప్రకటించిన ఏపీ సీఎం జగన్ దానిపై కమిటీ వేసి వేగంగా రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది.