- డిజిటల్ టికెట్లను స్కాన్ చేసి ఇకపై లోపలకు..
- పోలీస్ శాఖతో కలిసి హెచ్‌సీఏ కీలక నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఇక నుంచి గ్రౌండ్లోకి ఈజీగా వెళ్లిపోవచ్చు. గతంలో ఎంట్రీ ప్రాసెస్చాలా ఆలస్యమయ్యేది. రద్దీ ఎక్కువగా ఉండేది. లోపలకు వెళ్లాలన్న ఆతృతతో తోసుకోవడంతో తోపులాటలు కూడా జరిగి టికెట్ వెరిఫికేషన్ ఆలస్యమయ్యేది. అలాగే కొంతమంది డూప్లికేట్టికెట్లు కూడా తీసుకువచ్చి వెళ్లడం, ఒరిజినల్టికెట్లు తీసుకువచ్చిన వాళ్లు గొడవపడడం లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి హెచ్‌సీఏ, పోలీసు శాఖ కలిసి క్యూ ఆర్కోడ్స్కానింగ్సిస్టమ్తో చెక్‌పెట్టింది.
గతంలో ఇలా..
గతంలో ఐపీఎల్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మ్యానువల్ గా టికెట్స్ తీసుకునేందుకు జింఖానా గ్రౌండ్స్, మెట్రో స్టేషన్లు అలాగే టికెట్స్అమ్మే ఇతర చోట్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ పాస్ వర్డ్ లేదా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసుకుని టికెట్స్ ఇచ్చేవాళ్లు. తర్వాత మ్యాచ్ రోజు మళ్లీ ఆ టికెట్లను తీసుకుని గ్రౌండ్ కు వెళ్లాల్సి వచ్చేది. అలాగే మాన్యువల్పద్ధతిలో చాలా ఇబ్బందులు ఉండేవి. 2023 ఏప్రిల్ 18న జరిగిన సన్ రైజర్స్ మ్యాచ్‌లో నకిలీ టికెట్స్ వ్యవహారం కలకలం రేపింది. పేటీఎం నుంచి10 టికెట్స్ కొన్న ఓ యువతి.. స్టేడియానికి వెళ్లి చూసేసరికి వేరే వ్యక్తులు ఆ సీట్లలో కూర్చున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా అవి నకిలీ టికెట్లని తేలింది. వీటికి కూడా క్యూఆర్ కోడ్‌తో చెక్ పడనున్నది.
మారిపోయిందిలా..
ఈసారి గేట్ల వద్ద చెకింగ్ టైమ్ గందరగోళం నుంచి తప్పించేందుకు హైదరాబాద్ క్రికెట్అసోసియేషన్ పోలీస్ శాఖతో కలిసి క్యూ ఆర్కోడ్స్కానింగ్తో లోపలికి పంపించనున్నది. మ్యాచ్ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు క్యూఆర్ కోడ్ యాక్టివేట్అవుతుంది. ఈ టైం తర్వాతే టికెట్ తీసుకున్న వారు క్యూఆర్ కోడ్ ను స్టేడియం వద్ద తమకు కేటాయించిన గేట్ వద్ద చూపించగానే స్కాన్ అయి లోపలకు అనుమతిస్తుంది.
సోమవారం జరగనున్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మ్యాచ్ నుంచే దీన్ని అమలులోకి తీసుకురానున్నారు. ఒకవేళ మీరు వేరే నంబర్మీద టికెట్స్బుక్చేస్తే 5 గంటల ముందుగానే మీ ఫ్రెండ్స్ కు క్యూఆర్ కోడ్ స్కాన్ షేర్ చేయాలి. లేకపోతే ఆ టికెట్ స్కాన్ అవ్వదు. ఇప్పటికే ఉప్పల్ లో ఒక మ్యాచ్ పూర్తి కాగా, సోమవారం, ఈ నెల18, 21, మే 3, 6, 22 జరగనున్న మ్యాచ్‌లలో క్యూ ఆర్ కోడ్పద్ధతిని అవలంభించనున్నారు.

