PV Sindhu Australian Open: భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన పీవీ సింధు (PV Sindhu) కు ఈ 2026 సీజన్‌లో ఫస్ట్ మేజర్ టైటిల్ కొట్టాలనే ఆశ నిరాశగానే మిగిలిపోయింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న 'ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026' (BWF Super 500) టోర్నమెంట్‌లో ఈరోజు (శనివారం) జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో సింధు ఓడిపోయింది. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్, ప్రపంచ నెంబర్ 3 క్రీడాకారిణి అకానె యమగూచి (Akane Yamaguchi) తో జరిగిన పోరులో సింధు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
హోరాహోరీగా గేమ్:
* దాదాపు 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 10 స్థానంలో ఉన్న పీవీ సింధు.. జపాన్ స్టార్ యమగూచి చేతిలో 20–22, 12–21 తేడాతో వరుస గేమ్స్‌లో ఓడిపోయింది.
* టాఫ్ ఫైట్: ఫస్ట్ గేమ్‌లో పీవీ సింధు చాలా స్ట్రాంగ్‌గా స్టార్ట్ చేసింది. మిడ్-గేమ్ బ్రేక్ సమయానికి కొద్దిపాటి లీడ్‌లో కూడా ఉంది. అయితే బ్రేక్ తర్వాత యమగూచి వరుసగా 6 పాయింట్లు కొట్టి కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత సింధు కూడా గట్టిగా పోరాడి 19–20 దగ్గర ఒక మ్యాచ్ పాయింట్‌ను సేవ్ చేసినా.. ఆఖర్లో పాయింట్ చేజార్చుకుని 20–22తో ఫస్ట్ గేమ్‌ను ప్రత్యర్థికి ఇచ్చేసింది.
* యమగూచి డామినేషన్: ఇక సెకండ్ గేమ్‌లో మాత్రం జపాన్ షట్లర్ చెలరేగిపోయింది. స్టార్టింగ్ నుంచే వరుసగా 7 పాయింట్లు సాధించి 13–6 తో భారీ లీడ్ సాధించింది. ఆ తర్వాత సింధుకు ఏమాత్రం కోలుకునే ఛాన్స్ ఇవ్వకుండా 21–12తో సెకండ్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
* సింధుకు ఈ 2026 బీడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ టూర్‌లో ఇది రెండో సెమీఫైనల్ కావడం గమనార్హం. అంతకుముందు జనవరిలో జరిగిన మలేషియా ఓపెన్ సూపర్ 1000 లోనూ ఆమె సెమీస్ చేరి చైనా ప్లేయర్ వాంగ్ జియి చేతిలో ఓడిపోయింది. సింధు లాస్ట్ టైమ్ 2024లో లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీలో టైటిల్ గెలిచింది.
ALSO READ: ధర్మశాలలో దంచికొట్టిన వర్షం..
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇంటికి ఇండియా:
పీవీ సింధు ఓటమితో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోటీ ముగిసింది. అంతకుముందే పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఎంఆర్ అర్జున్, హరిహరన్ అంసకరుణన్ జోడీ మధ్యలోనే రిటైర్ అవ్వడంతో వాళ్ల జర్నీ ముగిసిపోగా.. మెన్స్ సింగిల్స్ ఆడిన భారత ప్లేయర్స్ ఎవరూ కూడా కనీసం మొదటి రౌండ్ దాటలేకపోయారు.
TOTAL DOMINATION BY PV SINDHU 🔥🔥🔥
— The Khel India (@TheKhelIndia) June 12, 2026
She defeated Chen Su 🇹🇼 21-6, 21-9 in the Quaterfinals of Australian Open (Super 500) 💥
WELL DONE CHAMP! 🇮🇳🙌pic.twitter.com/lveUzUnaxK
