హెచ్ పీవీ వ్యాక్సిన్పై అపోహలు వద్దు

హెచ్ పీవీ వ్యాక్సిన్పై అపోహలు వద్దు

చెన్నూరు, వెలుగు: హెచ్ పీవీ వ్యాక్సిన్​పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు ఈ వ్యాక్సిన్​ను తప్పనిసరిగా వేయించాలని చెన్నూరు మండలం అంగ్రస్​పల్లి మెడికల్ ఆఫీసర్ కృష్ణ తేజ సూచించారు. హెచ్​పీవీ వ్యాక్సిన్ మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్​ను నివారిస్తుందని తెలిపారు.

ఈ వాక్సిన్​ ప్రైవేట్​లో రూ.4 వేలు ఉంటుందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఐదు కోట్ల మంది ఈ టీకాను వేయించుకున్నారని తెలిపారు. తల్లితండ్రులు తమ బాలికలకు ఈ టీకాను దగ్గరుంచి వేయించాలని కోరారు.