
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైరస్ పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ కోసం చేపట్టే ఆర్‌టీ పీసీఆర్ టెస్టులకు డిమాండ్ బాగా ఎక్కువైంది. ర్యాపిడ్ టెస్టు చేయించుకున్న వాళ్లు కూడా ఆర్‌టీ పీసీఆర్ చేయించుకుంటున్నారు. దీంతో ల్యాబొరేటరీలపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల మీద ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.
ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు ఎప్పుడు చేయాలంటే..
- ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినప్పుడు ఆర్‌టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి.
- ర్యాపిడ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చి.. కరోనా లక్షణాలు ఉంటే ఆర్‌టీ పీసీఆర్ చేయించుకోవచ్చు.
- హోమ్ ఐసోలేషన్‌లో 10 రోజులు ఉండి.. మూడ్రోజులుగా జ్వరం లక్షణాలు లేనివారు ఆర్‌టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు.
- ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆర్‌టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు.
- దేశీయంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలనుకునే వారు ఆర్‌టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు.