జూబ్లీహిల్స్‌‌‌‌లో బోగస్ ఓట్లపై ..ఉత్తర్వులు అక్కర్లేదు: హైకోర్టు

జూబ్లీహిల్స్‌‌‌‌లో బోగస్ ఓట్లపై ..ఉత్తర్వులు అక్కర్లేదు: హైకోర్టు
  • చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చింది: హైకోర్టు
  • బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, మాగంటి సునీత పిటిషన్‌‌‌‌పై విచారణ ముగింపు 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ నియోజకవర్గంలో బోగస్‌‌‌‌ ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థి ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్న ఎన్నికల సంఘం హామీ నేపథ్యంలో ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. 

 నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి విన్నవించినా చర్యలు తీసుకోలేదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి మాగంటి సునీత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైకోర్టులో లంచ్‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. దీనిని చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జీఎం మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్ విచారించింది.

ఓటర్ల జాబితా తప్పుల తడక: పిటిషనర్ లాయర్ 

పిటిషనర్ల తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైందన్నారు. ‘‘ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఒక మహిళకు డిసెంబరులో నల్గొండ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఒక్కొక్కరికి రెండు అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. 

ఇలాంటి వాళ్లు 1,942 మంది ఓటర్ల జాబితాలో ఉన్నారు. అంతేగాకుండా బయటి ప్రాంతాలకు చెందిన 12 వేల మంది జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఉన్నారు. చిన్న చిన్న ఇళ్లకు సంఖ్యకు మించి ఓటర్లు ఉన్నారు. యూసుఫ్‌‌‌‌‌‌‌‌గూడలో చిన్న ఇంటిలో 44 ఓట్లు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలన్నీ ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనివే. 

ఓటర్ల జాబితాలోని అవకతవకలను గుర్తించి ఈ నెల 13, 14 తేదీల్లో పిటిషనర్లు రెండు వినతి పత్రాలు సమర్పించినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటర్ల జాబితాలోని అవకతవకలను సరిది ఎన్నికలు నిర్వహించేలా కోర్టు జోక్యం చేసుకోవాలి” అని కోరారు. 

చర్యలు తీసుకుంటున్నాం: ఈసీ లాయర్ 

కేంద్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అవినాశ్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు ఈ నెల 14న వినతిపత్రం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. దాన్ని పరిశీలించే అవకాశం కూడా ఎన్నికల సంఘానికి ఇవ్వకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ‘‘ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు నిరంతర ప్రక్రియ. ఏవైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు నామినేషన్లు వేసేదాకా మార్పుచేర్పులు చేయొచ్చు. 

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికకు సంబంధించి జులైలో డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్, సెప్టెంబరులో తుది నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేశాం. ఈ నెల 6న ఎన్నికల షెడ్యూలు, 13న ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ అయింది. ఇంతకాలం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని పిటిషనర్లు.. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ అయ్యాక ఫిర్యాదు చేస్తున్నారు. పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుం” అని తెలిపారు. 

ఇరుపక్షాల వాదనలను విన్న బెంచ్.. పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాలపై నివేదిక తెప్పించి చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతటితో విచారణను మూసివేసింది.