కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ కాదు: కేంద్ర ప్రభుత్వం

కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ కాదు: కేంద్ర ప్రభుత్వం

కొత్త క్రాస్ టెస్ట్ నిబంధనల ప్రకారం.. కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లను అమర్చాలన్న నిబంధనలను సడలించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఓ ప్రటకనలో తెలిపారు. 

2023 అక్టోబర్ 1 నుంచి అన్ని ప్యాసింజర్ కార్లలో కనీసం ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ గతేడాది నితిన్ గడ్కరీ ప్రకటించారు. - డ్రైవర్,ముందు ప్రయాణీకులకు ఒక్కొక్కటి - రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఇప్పటికే తప్పనిసరి చేశారు. అయితే మరిన్ని ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చాలనే ప్రతిపాదన కార్ల తయాదారులనుంచి వ్యతిరేకత వచ్చింది.  

మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌ల జతచేస్తే.. ఒక్కో వాహనానికి $75 కంటే ఎక్కువ ఖర్చు కావచ్చని కేంద్రం ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఆటో మార్కెట్ డేటా ప్రొవైడర్ JATO డైనమిక్స్ ఖర్చులను కనీసం $231 పెంచుతుందని పేర్కొంది. ధరలు పెరుగుతాయని, ఇది కొనుగోలు దారులను తగ్గించే అవకాశం ఉందని మారుతి సుజుకి సంస్థ అభిప్రాయపడింది. 

‘‘ప్రజలు ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. వినియోగదారులు ఇష్టపడితే ఏ కారు మోడల్ లో ఆరు ఎయిర్ బ్యాగులు అమర్చుకోవచ్చని ’’ న్యూఢిల్లీలో జరగిన ఆటోమోటివ్ సదస్సులో నితిన్ గడ్కరీ తెలిపారు.