ఈ నెల 23న నెఫ్ట్ సేవలకు అంతరాయం

ఈ నెల 23న నెఫ్ట్ సేవలకు అంతరాయం

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ (NEFT) సంబంధించి అంతరాయం కలగనుంది. వచ్చే ఆదివారం(మే-23)న 14 గంటల పాటు NEFT సేవలను నిలిపివేస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(RBI) ట్విటర్‌ లో తెలిపింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. NEFT పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన తర్వాత సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తున్నామని తెలిపింది.

మే 22న బిజినెస్ టైమ్స్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి మే 23 మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్ వ్యవస్థ పనిచేయదని స్పష్టం చేసింది RBI.  ఆర్‌టీజీఎస్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.