ఆప్ అధికారంలోకి వస్తే కొత్త పన్నులుండవు

ఆప్ అధికారంలోకి వస్తే కొత్త పన్నులుండవు

117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌కు వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ తరహా వాగ్దానాలను ఇక్కడ కూడా అనుసరిస్తోంది. శనివారం జలంధర్‌లో ర్యాలీలో పాల్గన్న ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ .. తాము అధికారంలోకి వస్తే.. ప్రజలపై ఎటువంటి  కొత్త పన్నులు మోపబోమని హామీ ఇచ్చారు. 

తాము అధికారంలోకి వస్తే... డోర్‌ స్టెప్‌ సర్వీసులు, మహల్లా క్లినిక్‌లు తెస్తామని చెప్పారు కేజ్రీవాల్. పంజాబ్‌లో 16 వేల క్లినిక్స్‌ను తీసుకువస్తామని, ఆస్పత్రులను  అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు AAPకు ఐదేళ్ల సమయం ఇవ్వాలని కేజ్రీవాల్‌ కోరారు. ఢిల్లీలో పారిశ్రామిక వేత్తలను బీజేపీ ఓటు బ్యాంకుగానే చూసిందని, వారెప్పుడూ తనకు ఓటు వేయలేదని, వారి మనస్సులు గెలుచుకున్న తర్వాత.. తమకు అనుకూలంగా ఓటు వేయడం ప్రారంభించారని అన్నారు. మాకు ఐదేళ్లు సమయం ఇవ్వండని, మీ మనస్సులను కూడా గెలుస్తామని పంజాబ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విదంగా బలవంతపు మతమార్పిడిలకు వ్యతిరేకంగా చట్టం చేయాలన్నారు కేజ్రీవాల్‌.

మరిన్ని వార్తల కోసం..

మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్‌ వ్యాలిడిటీ పెంపు