పాఠశాలల్లో ఏది బోధించినా మాకు అభ్యంతరం లేదు

పాఠశాలల్లో ఏది బోధించినా మాకు అభ్యంతరం లేదు

పాఠశాలల్లో భగవద్గీత బోధించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య శనివారం అన్నారు. ‘భగవద్గీత బోధించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు భగవద్గీత, ఖురాన్ లేదా బైబిల్ ఏది బోధించినా మాకు అభ్యంతరం లేదు. ఈ పోటీ ప్రపంచంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందాలని మేం కోరుకుంటున్నాం. పిల్లలకు ఇంట్లో కూడా భగవద్గీత, రామాయణం, మహాభారతాలు నేర్పిస్తారు. పిల్లలకు నైతిక విద్య నేర్పించాలి’ అని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. అంతేకాకుండా.. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించకూడదన్నారు. తాము రాజ్యాంగం, సెక్యులరిజాన్ని విశ్వసిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ మతాన్ని నమ్ముతాం.. అదేవిధంగా దేశంలోని అన్ని మతాలను గౌరవిస్తామని సిద్ధరామయ్య అన్నారు. స్కూళ్లలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేరుస్తామన్న కర్నాటక విద్యాశాఖమంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. భగవద్గీతను బోధించడంపై కర్నాటక సర్కార్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు సిద్ధరామయ్య.

For More News..

మల్లు స్వరాజ్యం ఆరోగ్యం సీరియస్..

ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‎న్యూస్

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్