
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ అస్థిత్వాన్ని చెరిపేయగల శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వికాసా సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అస్థిత్వం– సవాళ్లు-, కర్తవ్యాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. ఉద్యమం సమయంలో తెలంగాణ అస్థిత్వంపై దాడి చేసిన వారే రూపాలు మార్చుకొని మళ్లీ దాడి చేస్తున్నారని విమర్శించారు. కుసుంబ సీతారామరావు, నందిని సిధారెడ్డి, మాడభూషి శ్రీధర్, వేణుగోపాలస్వామి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.