అమ్మానాన్న లేరు..ఇల్లు లేదు! అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు

అమ్మానాన్న లేరు..ఇల్లు లేదు! అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు
  • వృద్ధులైన నానమ్మ, తాత వద్ద ఉంటుండగా.. 
  • సాయం కోసం ప్రభుత్వాన్ని, దాతలను వేడుకోలు

నెక్కొండ, వెలుగు: అమ్మ, నాన్నకు కోల్పోయిన ఇద్దరు బాలికలు అనాథలు అయ్యారు. వరంగల్​జిల్లా నెక్కొండ మండలం పెద్దకోర్పోల్​గ్రామానికి చెందిన తక్కెళ్లపల్లి ఏలియా-, మమత దంపతులకు జెస్సీ, వర్షిత కూతుళ్లు ఉన్నారు. మమతకు అనారోగ్యంతో పాటు మతిస్థిమితం లేకపోవడంతో కొన్నేండ్ల కింద రైలు కింద పడి చనిపోయింది. ఏలియా కూలి పని చేసుకుంటూ తన కూతుళ్లను పోషించుకుంటుండగా.. రెండు రోజుల కింద  అతను అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.

మహబూబాబాద్​గురుకుల స్కూల్ లో జెస్సీ 9వ తరగతి చదువుతుండగా, స్థానిక ప్రభుత్వ స్కూల్ లో వర్షిత 5 వ తరగతి చదువుతుంది. వీరు వృద్ధులైన నానమ్మ మల్లమ్మ, తాత యాకయ్య వద్ద ఉంటున్నారు. వీరికి ఇల్లు లేక, తల్లిదండ్రులు లేకపోవడంతో బతుకు ప్రశ్నర్థకంగా మారింది. దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని, ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం చేయాలని బాధిత చిన్నారులతో పాటు గ్రామస్తులు వేడుకుంటున్నారు.