కర్తార్ పూర్ వెళ్లేందుకు ఇక పాస్ పోర్ట్ అక్కర్లే

కర్తార్ పూర్ వెళ్లేందుకు ఇక పాస్ పోర్ట్ అక్కర్లే
  • ఈజీగా పోయి రావచ్చు
  • 10 రోజుల ముందు రిజిస్ట్రేషన్‌ కూడా
  • పాకిస్తాన్​ నిర్ణయం

ఇస్లామాబాద్‌‌: కర్తార్‌‌‌‌పూర్‌‌‌‌ కారిడార్‌‌‌‌ ద్వారా గురుద్వార్‌‌‌‌సాహిబ్‌‌కు వచ్చే సిక్కు యాత్రికులపై ఉన్న కొన్ని ఆంక్షలను పాకిస్తాన్‌‌ ప్రభుత్వం ఎత్తేసింది. కారిడార్‌‌‌‌గుండా వచ్చే యాత్రికులకు పాస్‌‌పోర్ట్‌‌ అవసరం లేదని, 10 రోజుల ముందే రిజిస్ట్రేషన్‌‌ చేసుకోవాల్సిన పనిలేదని పాకిస్తాన్‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ శుక్రవారం ప్రకటించారు. “ ఇండియా నుంచి కర్తార్‌‌‌‌పూర్‌‌‌‌కు వచ్చే సిక్కు యాత్రికులకు రెండు రిక్వైర్‌‌‌‌మెంట్స్‌‌ను తొలగించాం. 1) పాస్‌‌ పోర్ట్‌‌ అవసరం లేదు. సరైన గుర్తింపు కార్డు ఉంటే చాలు. 2) 10 రోజుల ముందు రిజిస్టర్‌‌‌‌ చేయించాల్సిన పనిలేదు. ఈ నెల 9న కారిడార్‌‌‌‌ ఓపెనింగ్‌‌ సందర్భంగా, 12న సిక్కు గురువు 550వ జయంతి సందర్భంగా రెండు రోజులు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు” అని ఇమ్రాన్‌‌ ట్వీట్‌‌ చేశారు.

ఆనందం వ్యక్తం చేసిన అమరీందర్‌‌‌‌

కర్తార్‌‌‌‌పూర్‌‌‌‌ యాత్రికులకు పాస్‌‌పోర్ట్‌‌ అవసరం లేదని పాకిస్తాన్‌‌ తీసుకున్న నిర్ణయంపై పంజాబ్‌‌ సీఎం అమరీందర్‌‌‌‌ సింగ్‌‌ హ్యాపీ ఫీలయ్యారు.  “ పాస్‌‌పోర్ట్‌‌, రిజిస్ట్రేషన్‌‌ ఆంక్షలు ఎత్తేసినందుకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్స్‌‌. ఈ నిబంధనను కేవలం సిక్కులకే కాకుండా ఇండియన్స్‌‌ అందరికీ వర్తించేలా చూడండి. ఫీజు రూ.1417  కూడా పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాను” అని అమరీందర్‌‌‌‌ ట్వీట్‌‌ చేశారు.

No passport, advance registration needed: Imran Khan waives off 2 key rules ahead of Kartarpur inauguration