రాష్ట్రంలో ప్రైవేట్ ఇంటర్ కాలేజీల పర్మిషన్ పై వివాదం కొనసాగుతోంది. మిక్స్ డ్ ఆక్సుపెన్సీ ఉన్న కాలేజీలకు సర్కారు అనుమతి ఇవ్వలేదు. దీంతో 450 కాలేజీలు, వాటిలో చదువుతున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కాలేజీల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వం కావాలనే పర్మీషన్ ఇవ్వడం లేదని మండి పడుతున్నారు. సర్కారు తీరుపై విద్యార్థులు, పేరంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా...ప్రైవేటు కాలేజీల అసోసియేషన్ సభ్యుడితో v6 ముచ్చటించింది. ఇంటర్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయని, ప్రతి సంవత్సరం ఈ రకంగా వేధిస్తున్నారని వాపోయారు. లక్ష మంది స్టూడెంట్స్ చదువుతుంటారని వెల్లడిస్తున్నారు.
కొత్తగా నిబంధనలు పెట్టి.. గందరగోళానికి గురి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సడలింపులు చేయాలని కోరారు. పాత నిబంధనలు ప్రకారం కాలేజీలకు అనుమతినిచ్చారని, ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం 25 శాతం ఫీజులు పెంచారని, కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డామని ఇంటర్ బోర్డుకు తెలియచేయడం జరిగిందన్నారు. ఎంత ఫీజు పెంచినా.. తాము కడుతూనే ఉన్నామన్నారు. 450 కాలేజీలకు ఇవ్వకపోతే లక్ష మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.
