
రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు రావడంతో.. గురువారం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. దాంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు సాగర్ లోని 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
కొవిడ్ నేపథ్యంలో పర్యాటకులు ఎవరూ నాగార్జున సాగర్ కు రాకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్ ప్రాజెక్ట్ వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
For More News..