
కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా తీర్చిదిద్దడంలో పాక్ విఫలమైందన్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా తమకు మద్ధతు లభించడం లేదన్నారు. ఐక్యరాజ్యసమితిలో మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. కాశ్మీర్ విషయంలో తాము నిరాశ చెందామన్నారు. మోడీపై ఎలాంటి ఒత్తిడి లేదు కానీ.. తామెప్పటీకి ఒత్తిడి చేస్తూనే ఉంటామన్నారు. ఇండియాలో వంద కోట్లకు పైగా జనాభా, ఆర్థిక వ్యవస్థ వంటి కారణాల వల్లే ప్రపంచ దేశాలు తమకు మద్దతివ్వడం లేదన్నారు.