గైడ్లైన్స్ వచ్చే వరకు జీతంలో కోత వద్దు: చంద్రశేఖర్ గౌడ్ 

గైడ్లైన్స్ వచ్చే వరకు జీతంలో కోత వద్దు: చంద్రశేఖర్ గౌడ్ 

ట్యాంక్ బండ్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ గైడ్​లైన్స్​ఖరారు కాకముందే ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో వారి జీతంలో కోత విధించడం సరికాదని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్​గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‎లోని లిబర్టీలో గల సంఘం కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. 

ఈహెచ్ఎస్ అమలుకు హాస్పిటల్స్ తో ఒప్పందం కుదుర్చుకోకుండా, ప్యాకేజీ రేట్లు నిర్ణయించకుండా, డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వకుండానే ఉద్యోగుల వేతనం నుంచి 1.5 శాతం కట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి స్పందించి, ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు పూర్తిగా వచ్చేంతవరకు జీతాల్లో కోతను నిలిపివేయాలని కోరారు.