వెట్టిచాకిరీ నెపంతో అమెరికా పన్నుల వాత.. భారత్‌కు కొత్త టారిఫ్స్ సెగ తప్పదా..?

వెట్టిచాకిరీ నెపంతో అమెరికా పన్నుల వాత.. భారత్‌కు కొత్త టారిఫ్స్ సెగ తప్పదా..?

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్‌కు గట్టి షాక్ ఇచ్చేలా ఒక క్రేజీ ప్లాన్ సిద్ధం చేశారు. ‘ఫోర్స్డ్ లేబర్’ అంటే వెట్టిచాకిరీ లాంటి అన్యాయమైన వ్యాపార పద్ధతులను పాటిస్తోందంటూ.. ఇండియాపై ఏకంగా 12.5% అదనపు టారిఫ్ విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతిపాదించింది. సెక్షన్ 301 విచారణలో భాగంగా ఈ సిఫార్సు బయటకొచ్చింది.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే:
నిబంధనలు పాటించే చాలా దేశాలకు కేవలం 10% పన్ను వేస్తుంటే.. భారత్‌తో పాటు చైనా, జపాన్, సౌత్ కొరియా, బ్రెజిల్ వంటి 54 దేశాలకు మాత్రం 12.5% బాదుడు తప్పేలా లేదు. ఫోర్స్డ్ లేబర్ వస్తువులను నిషేధించే కఠినమైన రూల్స్ ఉన్న దేశాలకు 10% పన్ను ఉంటుందని, మిగతా వారికి 12.5% పన్ను పడుతుంది అని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తేల్చి చెప్పింది.

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ట్రంప్ సర్కార్ అందరికీ 10% బేస్‌లైన్ పన్ను ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 2026 నాటి తాత్కాలిక ఒప్పందం ప్రకారం భారత్‌కు ఇది ఇప్పటికే 18% కి చేరింది. ఇప్పుడు నడుస్తున్న సెక్షన్ 301 విచారణతో ఈ పన్నుల భారం మరింత పెరిగే అవకాశం ఉండటంతో భారతీయ వ్యాపార వర్గాల్లో టెన్షన్ మొదలైంది.

మరి ఇండియా బిజినెస్‌ల పరిస్థితి ఏంటి?
కంగారు పడాల్సింది ఏం లేదు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఇంకా అమలు కాలేదు. దీనిపై పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాకే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. మరోవైపు ఈ పన్నుల పంచాయితీని తేల్చడానికి అమెరికా డెలిగేషన్ ప్రస్తుతం న్యూఢిల్లీలోనే విచారణ జరుపుతోంది. ఇప్పటికే మేజర్ పాయింట్స్ అన్నీ సెటిల్ అయ్యాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. డీల్ మొదటి విడత త్వరలోనే పూర్తి చేసి సంతకాలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమెరికాతో సమానమైన, న్యాయమైన డీల్ కుదిరితేనే భారత్ అంగీకరిస్తుందని నిపుణులు అంటున్నారు.