అప్పుడే రేట్లు పెంచేశారు… బంక్‌ల ముందు నో స్టాక్ బోర్డులు

అప్పుడే రేట్లు పెంచేశారు… బంక్‌ల ముందు నో స్టాక్ బోర్డులు

పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్ ల పేరుతో కేంద్రం 2 రూపాయల పెంపును ప్రకటించింది. హైదరాబాద్ లో పెట్రోల్ పై రూ.2.50… లీటర్ డీజిల్ పై రూ.2.50 పెరిగింది. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిందో లేదో… సిటీలోని చాలా పెట్రోల్ బంక్ ల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. దీంతో… వాహనాలు నడిపేవారికి తిప్పలుతప్పడం లేదు.

లాభాలపై ఆశతో కస్టమర్లకు సర్వీస్ ను అందించడం లేదు. మరికొందరైతే పెరిగిన రేట్ల ప్రకారం ధరలు సర్దుబాటు చేశారు. కస్టమర్లు ప్రశ్నిస్తే తమకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి .. అలాగే చేశాం అని బదులిస్తున్నారు బంక్ ల నిర్వాహకులు.