మావోయిస్టు పార్టీలో..అంతర్గత చీలికలు

మావోయిస్టు పార్టీలో..అంతర్గత చీలికలు

హైదరాబాద్: తాము పోలీసులకు లొంగిపోలేదని,తమ సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరి తరమూ కాదని మావోయిస్టు పార్టీ అగ్రనేత చంద్రన్న అభియాన్ ప్రసాదరావు అన్నారు. ఇవాళ డీజీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేస్తామని వెల్లడించా రు. మావోయిస్టు పార్టీలో అంతర్గత బిలికలు వచ్చా యని చెప్పారు.

 తమది లొంగుబాటు కాదని, అభి వృద్ధిలో కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకొనే వచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యమంలో తాము పీడిత ప్రజల కోసం పనిచేశామని, భవి ష్యత్తు లోనూ పీడిత ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు. పార్టీకి ఆయుధాలు అప్పగించి వచ్చామ ని చెప్పారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీ ఎన్నుకున్నారని తెలిపారు. 

తాను దేవ్ జీని సపోర్ట్ చేస్తున్నట్టు తెలిపారు. దేశమంతా మావో ఐడియాలజీతోనే ఉందని తాము ప్రజల మధ్య ఉండి అదే ఐడియాలజీతో పనిచేస్తామని చెప్పారు. అనారోగ్యం సమస్యలతో లొంగిపోవాల్సి వచ్చిం దని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పార్టీని వీడాల్ని వచ్చిందని వివరించారు.

లొంగిపోతే చర్యలుండవ్: డీజీపీ

జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలంగాణ డీజీపీ శిపధర్రెడ్డి స్పష్టం చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాశ్ తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. 1980లో పుల్లూరి ప్రసాదరావు కిషన్ అనుచరుడిగా మారారు. 1981లో పీపుల్స్ వార్​ లో చేరారని డీజీపీ చెప్పారు. 

1983లో కమాండర్ అయ్యారని,1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారనిఅన్నారు. 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీసభ్యుడయ్యారని, 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి పిలుపుతో పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయార ని డీజీపీ తెలిపారు. మావోయిస్టు మరో నేత బండ ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశార న్నారు. 

అతని స్వస్థలం మందమర్రి. ఏడో తరగతి చదువుతున్నప్పుడే నక్పలి జం వైపు ఆకర్షితులయ్యారని అన్నారు. 2004లో జరిగిన శాంతి చర్చల్లో ప్రకాశ్ పాల్గొన్నారని వివరించారు. 2014లో స్టేట్ కమిటీ సభ్యుడయ్యారు. నేషనల్ పార్క్ ఏరియా కీలక ఆర్గనైజర్ బాధ్యతలు నిర్వహించారని వివరించారు. బండ ప్రకాశ్పై ఉన్న రూ.20లక్షల రివార్డు ఆయనకు ఇస్తామని తెలిపారు. 

పుల్లూరి ప్రసాదరావుపై ఉన్న రూ.25లక్షల రివార్డు ఆయనకు ఇవ్వనున్నట్టు చెప్పారు. తెలంగాణకు చెందిన ఇంకా 64 మంది మావోయిస్టులు కొనసాగుతు " న్నారని, పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కరెక్ట్ కాదని అన్నారు. అవసరమైతే వారికి రక్షణ కల్పిస్తామని డీజీపీ తెలిపారు.