నో చేంజ్ … రూ.5 లక్షల ఆదాయం వరకు పన్నులేదు

నో చేంజ్ … రూ.5 లక్షల ఆదాయం వరకు పన్నులేదు

రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. 2019-20 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆమె..  విద్యుత్‌ వాహనాలపై  GST 12% నుంచి 5%నికి తెచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ అంశం జీఎస్టీ మండలి పరిశీలిస్తోందన్నారు. అలాగే పన్నుల విధానంలో  ట్రాన్స్ఫరెన్సీ తీసుకువస్తామని అన్నారు. ఇక  కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధి రూ.400కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు.