సమస్య వస్తే ముస్లీంల తరపున నేను మాట్లాడతాను

సమస్య వస్తే ముస్లీంల తరపున నేను మాట్లాడతాను

పౌరసత్వ చట్టం వల్ల ముస్లీంలకు ఎటువంటి ఆటంకం కలగదని తలైవా రజనీకాంత్ అన్నారు. సీఏఏ వల్ల వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వారి తరపున మాట్లాడటానికి తాను ముందుంటానని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ జనాభా రిజిష్టర్ కూడా అవసరమని ఆయన అన్నారు. భారత్, పాక్‌లు విడిపోయిన తర్వాత.. భారత్‌లో ఉండాలని నిర్ణయించుకున్న ముస్లీంలను బయటకు ఎలా పంపిస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.

సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉద్దేశించి.. సీఏఏ గురించి వారి ప్రొఫెసర్లతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ‘సీఏఏ వల్ల భారత ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నాయి’ అని రజనీకాంత్ అన్నారు.

డిసెంబరులో దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసనల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హింస మరియు అల్లర్లు ఏ సమస్యకైనా పరిష్కార మార్గాన్ని చూపవని ఆయన అన్నారు. దేశ భద్రత మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు. ప్రస్తుతం రజనీకాంత్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు.

మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలు భారత్‌లో స్థిరపడాలంటే ఈ చట్టం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. ముస్లీంలపై వివక్ష చూపడానికే ఈ చట్టాన్ని రూపొందించారని సీఏఏ విమర్శకులు అంటున్నారు.

For More News..

వీడియో వైరల్: ఇండియా-పాకిస్తాన్ అండర్19లో సూపర్ అవుట్

కాజల్ మైనపు బొమ్మ.. అచ్చు కాజల్‌ను తలపించేలా..