ప్రేమ,పెళ్లి కోసం పాక్ సరిహద్దు దాటి..దొరికింది

ప్రేమ,పెళ్లి కోసం పాక్ సరిహద్దు దాటి..దొరికింది

కాలం మారుతున్న కొద్దీ ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువవుతున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే దేశంలో ఉన్నవారే కాకుండా ఇతర దేశాల వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయి. అలాంటి వాటికి పెద్దలు అభ్యంతరం చెప్పినా.. ప్రభుత్వాల నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండటం లేదు. అయితే.. పాకిస్థాన్ కు చెందిన ఓ అమ్మాయి సరిహద్దులు దాటి వచ్చి భారత యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోదామనుకుంది. కాని.. విషయం తెలిసిపోవడంతో ఆ అమ్మాయిని భారత అధికారులు వాఘా సరిహద్దులో పాకిస్థాన్ అధికారులకు అప్పగించారు. 

పాకిస్థాన్‭కు చెందిన 16 ఏళ్ల ఇక్రా జివానీ ఆన్ లైన్ లో లూడో గేమ్ ఆడుతుండగా.. ఉత్తరప్రదేశ్‭కు చెందిన ములాయం సింగ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే ఇక్రా ములాయంతో ప్రమేలో పడింది. అతినిని పెళ్లి చేసుకుని భారత్ లోనే ఉండిపోవాలనుకుని పాక్ సరిహద్దులు దాటి ఇండియాకు వచ్చింది. అయితే.. ఆమెకు ఇండియా వచ్చేందుకు వీసా లేకపోవడంతో ముందుగా నేపాల్ చేరుకుంది. ఆ తర్వాత ఖాట్మండులో ములాయంను కలుసుకుంది. ఇద్దరూ అక్కడే పెళ్లి చేసుకుని.. సరిహద్దుల్లోని సనోలీ ప్రాంతం నుంచి భారత్‌లోకి ప్రవేశించారు. ములాయం కొన్నేళ్లుగా బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోనే కాపురం పెట్టాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇక్రా తన పేరును కూడా మార్చుకుంది. అయితే.. ఇక్రా ప్రతి రోజు నమాజ్ చేస్తుండటంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం ఇచ్చి.. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఇక్రాను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె నుంచి పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఆమెను పంజాబ్ లోని అమృత్ సర్ కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి అట్టారీ బోర్డర్ ద్వారా ఇక్రాను పాక్ కు తిప్పి పంపేశారు.