హైదరాబాదీల్లో నో విటమిన్‌ : ఎన్ఐఎన్ పరిశోధనలో వెల్లడి

హైదరాబాదీల్లో నో విటమిన్‌ : ఎన్ఐఎన్ పరిశోధనలో వెల్లడి

50% మందిలో
బీ2 లోపం

46% మందిలో
బీ6, బీ12

విటమిన్​బీ2 50%

సమస్యలు: నాడీ సంబంధ వ్యాధులు, రక్తహీనత, గుండె జబ్బులు, నోటి మూలల్లో చీలిక, నాలుకపై పూత, చర్మం పాలిపోవడం

ఉపయోగాలు: శరీర పెరుగుదల, కణజాలాల నిర్మాణం, కంట్లో శుక్లాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది

లభించే పదార్థాలు: పాల ఉత్పత్తులు, పుట్టగొడుగు, పాలకూర, బాదం పప్పు, ఎండు టామాటాలు, చేపలు, గుడ్లు

విటమిన్​బీ6 46%

ఫిట్స్, క్యాన్సర్, మైగ్రేన్, డిప్రెషన్, రోగ నిరోధక శక్తి తగ్గడం అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, జీర్ణక్రియలో, ప్రతిరక్షకాలు, హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో

గోధుమ, దంపుడు బియ్యం, సోయా చిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డుసొన

విటమిన్​బీ12 46%

ఆయాసం, చర్మం పాలిపోవటం, మతిమరుపు, లో బీపీ, వణుకు, చూపు తగ్గటం, బాలింతల్లో పాల ఉత్పత్తి తగ్గడం ఎర్ర రక్తకణాలు, యాంటీ బాడీల ఉత్పత్తికి, నాడీ కణపు మైలిన్ తొడుగు ఏర్పడటానికి, నోరు, కళ్లు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు కోడిమాంసం, పాలు, గుడ్డు, కాలేయం

విటమిన్​బీ9 32%

(ఫోలిక్‌ యాసిడ్‌) రక్తహీనత, అతిసారము, తెల్ల రక్త కణాలు తగ్గడం, ఆకలి వేయకపోవడం, గ్రహణం మొర్రి పిండం ఎదుగుదలకు, క్యాన్సర్
కణాలను తగ్గించేందుకు, ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బీన్స్, బటానీలు, నట్స్‌

డీవిటమిన్ 29%

హైదరాబాద్, వెలుగు: హైదరాబాదీలను విటమిన్‌‌ లోపం కలవరపెడుతోంది. ఆరోగ్యంగా కనిపిస్తున్న వారిలోనూ పోషకాల లోపం తీవ్రంగా ఉంటోంది. ఇటీవల హైదరాబాద్‌‌, సికింద్రాబాద్‌‌ల్లో 270 మంది రక్తం శాంపిళ్లను పరీక్షించిన నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సైంటిస్టులు ఈ విషయం వెల్లడించారు. ‘‘270 మందిలో 50 శాతం విటమిన్‌‌ బీ2 లోపంతో బాధపడుతున్నారు. చాలా మందిలో బీ కాంప్లెక్స్ పోషకాల్లేవు. డీ విటమిన్‌‌ లోపముంది. కనిపించిందని వెల్లడించారు. ప్రస్తుతానికి వీళ్లు ఆరోగ్యంగానే ఉన్నా విటమిన్ల లోపాన్ని ‘లైట్‌‌’ తీసుకుంటే రోగాలు తప్పవని హెచ్చరించారు.

50 శాతం మందికి బీ2 లోపం

హైదరాబాద్, సికింద్రాబాద్‌‌లలో ఆరోగ్యకరంగా ఉన్న 30 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల 147 మంది మగవారు, 123 మంది ఆడవారి బ్లడ్ శాంపిళ్లను సైంటిస్టు జి. భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఐఎన్ సైంటిస్టులు సేకరించి పరీక్షించారు. వీళ్లలో 50 శాతం మంది విటమిన్ బీ2 లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. 46 శాతం మందిలో బీ6, 46 శాతం మందిలో బీ12, 32 శాతం మందిలో ఫోలేట్ (బీ9), 29 శాతం మందిలో డీ విటమిన్‌‌ లోపం ఉన్నట్టు తెలిసింది. రక్తంలో హోమోసిస్టెయిన్ శాతమూ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

మగవారిలో మస్తు హోమోసిస్టెయిన్‌‌

మాంసం తినడం వల్ల రక్తంలో ఎక్కువయ్యే హోమోసిస్టెయిన్ మగవాళ్లలో ఎక్కువుందని, దీని వల్ల గుండె సంబంధ వ్యాధులొచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ బీ2 లోపంతో నాడీ సంబంధ వ్యాధులు, రక్తహీనత, గుండె జబ్బులు వస్తాయంటున్నారు. బీ6 లేకుంటే ఫిట్స్, క్యాన్సర్, మైగ్రేన్, రోగ నిరోధక శక్తి తగ్గడం, డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫోలేట్, బీ12, విటమిన్ ఏ లోపాలతో తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు.  ఆరోగ్యాన్నిచ్చే అన్ని రకాల తిండ్లూ బాగా తినాలని సైంటిస్టు భానుప్రకాష్ రెడ్డి సూచించారు.