24 రూపాయలకే ఐటీఆర్ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌.. జియో ఫైనాన్స్‌ ‌‌‌‌‌‌‌ఆఫర్

24 రూపాయలకే ఐటీఆర్ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌.. జియో ఫైనాన్స్‌ ‌‌‌‌‌‌‌ఆఫర్

న్యూఢిల్లీ: జియో ఫైనాన్స్ (జేఎఫ్‌ఎస్‌ఎల్‌) తమ యాప్‌‌‌‌‌‌‌‌లో ట్యాక్స్ ప్లానింగ్, ఫైలింగ్‌‌‌‌‌‌‌‌ను సులభతరం చేసే కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేసింది. ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌  రిటర్న్ (ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫైలింగ్ సీజన్ జోరుగా సాగుతుండగా, సరైన ట్యాక్స్ రిజీమ్​​ (విధానం) ఎంపిక, 80సీ, 80డీ వంటి సెక్షన్ల కింద గరిష్ట డిడక్షన్లను సాధించే ఫీచర్‌‌‌‌‌‌‌‌ను జియో ఫైనాన్స్ తీసుకొచ్చింది. జేఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం, ఈ ఫీచర్ భారతీయ పన్ను చెల్లింపుదారులకు సులభమైన, అందుబాటు ధరలో  ట్యాక్స్ ప్లానింగ్, ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది. ట్యాక్స్‌‌‌‌‌‌‌‌బడ్డీతో కలిసి దీనిని అభివృద్ధి చేశారు.

‘‘ట్యాక్స్ ఫైలింగ్ ఫీచర్ పాత, కొత్త రీజిమ్‌‌‌‌‌‌‌‌ల గందరగోళాన్ని తొలగిస్తుంది. ట్యాక్స్ ప్లానర్ వ్యక్తిగత డిడక్షన్ మ్యాపింగ్, హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ అంచనా, రీజిమ్ పోలికలతో భవిష్యత్ ట్యాక్స్ బాధ్యతలను తగ్గిస్తుంది. సెల్ఫ్-సర్వీస్ ఫైలింగ్ రూ.24 నుంచి, నిపుణుల సహాయంతో రూ.999 నుంచి ప్రారంభమవుతుంది”అని జియో ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ సీఈఓ హితేష్ సేథియా  అన్నారు.