
- ప్రైవేటు ఆసుపత్రులపై దాడులను అరికట్టాలి
- శంషాబాద్ లో డాక్టర్ల నిరసన ర్యాలీ
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రులపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు, సిబ్బంది భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. లిమ్స్, ఆర్ఖన్, సన్‌రైజ్, ఇషా, శ్రీనివాస్, స్వామి, అమృత, రామయ్య తదితర ఆసుపత్రుల డాక్టర్లు, సిబ్బంది శంషాబాద్ బస్టాండ్ నుంచి ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు.
అనంతరం డాక్టర్ల బృందం శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ కు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఆగస్టు 8న శంషాబాద్‌లోని లిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్ల సమస్యతో చేరిన మహిళ ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో ఆమె తరఫు బంధువులు ఆసుపత్రిలోకి ప్రవేశించి డాక్టర్లు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.