సంచార జాతులు చదివి ఎదగాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సంచార జాతులు చదివి ఎదగాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

బషీర్​బాగ్, వెలుగు: సంచార జాతులు బాగా చదివి రాజకీయంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో తెలంగాణ సంచార విముక్త జాతుల దినోత్సవం బుధవారం (సెప్టెంబర్ 10) జరగగా మంత్రి గెస్ట్​గా హాజరయ్యారు. 

మంచి తరాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం  విద్యకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.400 కోట్లు ప్రకటించి, ఇప్పటికే రూ.వంద కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. కుల వృత్తులు మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 

ఈ వేడుకల్లో సంచార జాతుల కుల వృత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు