స్కూళ్లలో రెగ్యులర్ అటెండెన్స్.. అంతంతే!

స్కూళ్లలో రెగ్యులర్ అటెండెన్స్.. అంతంతే!
  • నెల రోజులుగా తగ్గుతున్న అటెండెన్స్
  • పేరెంట్స్​లో ఒమిక్రాన్​వేరియంట్​ టెన్షన్​

హైదరాబాద్, వెలుగు: ఏడాదిన్నర తర్వాత మూడునెలల కిందటనే  స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. మళ్లీ ఒమిక్రాన్​వేరియంట్​పేరెంట్స్​ను భయపెట్టిస్తోంది. దీంతో పిల్లల్ని స్కూళ్లకు కష్టంగానే పంపస్తున్నారు. చాలామంది పేరెంట్స్ స్కూళ్లకు పంపకపోతుండగా, నెల రోజులుగా  ప్రైమరీ క్లాసుల్లో అటెండెన్స్ పర్సెంటేజ్ తగ్గిందని స్కూల్​ మేనేజ్​మెంట్లు చెబుతున్నాయి. నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు 60 శాతం ఉన్న అటెండెన్స్​30 శాతానికి పడిపోయిందని పేర్కొంటున్నాయి. ఒమిక్రాన్​నేపథ్యంలో ఆన్ లైన్​క్లాస్​లే పెట్టాలంటూ పలువురు పేరేంట్స్​ కోరుతున్నారు. 
స్కూళ్ల తీరుపై పేరెంట్స్ లో.. 
జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో  మొదట్లో  ఎనిమిది నుంచి పదో తరగతి వరకు మాత్రమే ఫిజికల్​క్లాస్​లు స్టార్ట్​ అయ్యాయి. కొన్ని రోజులకు ప్రైమరీ క్లాస్​లు కూడా షురూ చేశారు. మొదట్లో  ప్రీ ప్రైమరీలో 20 నుంచి 30శాతం , ప్రైమరీలో 40 నుంచి 60 శాతం, హయ్యర్​క్లాస్​ల్లో  80 నుంచి 100శాతం అటెండెన్స్​ఉండేదని, ఇప్పుడు పూర్తిగా తగ్గిందని మేనేజ్​మెంట్లు అంటున్నాయి. ఒమిక్రాన్ కేసులు వస్తున్నప్పటికీ కొన్ని ప్రైవేట్​స్కూల్స్​కచ్చితంగా పిల్లల్ని ఫిజికల్​ క్లాస్​లకు  పంపాలని చెప్తున్నాయి.  స్కూళ్ల తీరుపై పేరెంట్స్ కొంత ఇబ్బంది పడుతున్నారు. మరి కొందరు పేరెంట్స్​తమ పిల్లల్ని పూర్తిగా స్కూల్​మాన్పించి, ఇంట్లో టీచింగ్​చెప్పిస్తున్నారు. 
ఆన్​లైన్ ​క్లాసులు పెట్టాలని..
పేరెంట్స్​లో ఒమిక్రాన్​ భయం మొదలైంది. కొన్ని స్కూళ్లు ఫిజికల్ ​క్లాస్​లే చెప్తాం అంటుండగా, మరికొన్ని స్కూళ్లు ఆన్​లైన్​ క్లాసులకు ఒప్పుకోవడం లేదు. ఇంకొన్ని స్కూళ్లు ఆన్​లైన్, ఆఫ్​లైన్​​ క్లాస్​లు రెండు కండక్ట్​ చేస్తున్నాయి. పేరెంట్స్​లో చాలామంది  ఏడో క్లాస్​లోపు పిల్లలను స్కూల్ కు  పంపేందుకు రెడీగా లేరు. 
- వెంకట్ , జాయింట్ సెక్రటరీ, హైదరా బాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్
ముందు ముందు ఎలా ఉంటుందో..
ప్రస్తుతం అటెండెన్స్ కొంచెం తక్కువే ఉంది. తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుంచి టెన్త్ ​వరకు ఫిజికల్​గా కండక్ట్​ చేస్తున్నాం. సేఫ్టీ  ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. - వీరయ్య, ప్రిన్సిపాల్, రవీంద్రభారతి స్కూల్​.