లండన్: ఇండియన్ ఆరిజన్ ఫిజీషియన్ యూకే అవార్డుకు ఎంపికయ్యారు. కరోనా సంక్షోభ సమయంలో చేసిన సేవలకు మన ఫిజీషియన్ రవి సోలంకికి యూకేకు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ స్పెషల్ అవార్డు దక్కింది. వైరస్ సోకి న పేషెంట్లకు ఆయన వాలంటీర్‌గా సేవ చేశారు. మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తున్న రేమండ్ సీమ్స్ అనే వ్యక్తితో కలిసి న్యూ నేషన్ హెల్త్ సర్వీస్ అనే స్వచ్ఛంద సంస్థ హీరోస్ కోసం స్టార్ట్ చేసిన వెబ్‌సైట్‌లో.. కరోనాతో బాధపడే వారికి సలహాలు, సూచనలు ఇచ్చారని అకాడమీ ప్రతినిధులు చెప్పారు. తక్కువ సమయంలో వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసి కరోనా వారియర్లకు హెల్ప్ చేసినందుకు ఈ అవార్డుకుఎంపిక చేశారు.

